లఖింపుర్ ఖేరి కేసులో (Lakhimpur Kheri Case) ప్రధాన నిందితునిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra Lakhimpur) డెంగీ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే శనివారం సాయంత్రం ఆయనను తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆశిష్‌కు వైద్య పరీక్షలు చేయించగా.. డెంగీ ఉన్నట్లు తేలిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.
తదుపరి విచారణ కోసం పోలీసులు ఆశిష్ మిశ్రాతో పాటు మరో ముగ్గురిని రెండురోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో రైతుల నిరసన సందర్భంగా చెలరేగిన హింసలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు మొత్తం 13 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి:
కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు అరెస్ట్
Lakhimpur Violence: ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Lakhimpur kheri case: కేంద్ర మంత్రి తనయుడికి బెయిల్ నిరాకరణ