లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో (Lakhimpur Kheri violence) మృతిచెందిన రైతులు, విలేకరి సంస్మరణ సభ తికోనియాలో (Tikoniya Lakhimpur Kheri) మంగళవారం భారీస్థాయిలో జరిగింది. సిక్కు సంప్రదాయంలో 'అంతిమ్ అర్దాస్' ప్రార్థనలు నిర్వహించారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ (Rakesh Tikait Lakhimpur Kheri) ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన నేతలు, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వేదికపై మృతుల ఫొటోలను పట్టుకుని వారి కుటుంబసభ్యులు కూర్చున్నారు. (Lakhimpur Kheri case)
రైతు నాయకులు కోరినట్టే రాజకీయ నేతలెవరూ వేదికపైకి వెళ్లలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, యూపీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌కుమార్ లల్లూ, సీనియర్ నేత దీపేందర్‌సింగ్ హుడా, సమాజ్‌వాదీ పార్టీ నేతలతో పాటు... సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ నేతలు దర్శన్‌సింగ్ పాల్, జోగిందర్‌సింగ్ ఉగ్రహాన్, ధర్మేంద్ర మాలిక్ తదితరులు హాజరయ్యారు. వీరంతా మృతులకు ఘనంగా నివాళులర్పించారు. (Lakhimpur Kheri news)
తికోనియాకు తరలివచ్చిన ప్రియాంక, రైతు నేతలు
తికోనియాలో యూపీ పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భారీగా మోహరించారు. (Lakhimpur Kheri incident) మార్గమధ్యంలో సీతాపుర్ టోల్ పాయింట్ వద్ద ప్రియాంకను పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నట్టు కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆమెను ఉద్దేశిస్తూ లఖింపుర్‌లో 'నకిలీ సానుభూతి మాకు అక్కర్లేదు' అన్న వ్యాఖ్యలతో పోస్టర్లు వెలిశాయి.
లఖింపుర్ ఖేరి జిల్లా, తికోనియా వద్ద ఈనెల 3న జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రను... క్రైం బ్రాంచ్ కార్యాలయంలో పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు. శేఖర్ భారతి అనే నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయినవారి సంఖ్య 4కు చేరింది.
వాటిపై మౌనం ఎందుకు?: భాజపా
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా, వాటిపై రాహుల్, ప్రియాంకా గాంధీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నించారు. లఖింపుర్ ఖేరి ఘటన నేపథ్యంలో యూపీకి తరలివస్తున్న వివిధ పార్టీల నేతలు... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని బాధిత దళిత కుటుంబాలను మాత్రం పరామర్శించడం లేదన్నారు.
ఇదీ చదవండి: