అదృష్టం.. ఓ కూలీ జీవితాన్ని మార్చేసింది. రాత్రికి రాత్రే అతణ్ని లక్షాధికారిని చేసింది. గనుల్లో పని చేసే ఓ వ్యక్తికి రూ.లక్షలు విలువ చేసే వజ్రం(mine labourer finds diamond) దొరికింది. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో(madhya pradesh panna news) ఈ సంఘటన జరిగింది.
పన్నా జిల్లాలో(panna diamond mines) హీరాపుర్ తపరియన్ ప్రాంతంలోని గనుల్లో పని చేసే శంశేర్ ఖాన్ అనే వ్యక్తికి ఈ వజ్రం లభించింది. 6 క్యారెట్ల 66 సెంట్ల బరువుతో ఉన్న ఈ వజ్రం ధర రూ.20 లక్షలుగా ఉంటుందని అంచనా. ఈ వజ్రాన్ని ఇప్పుడు అతడు వేలం వేసేందుకు ప్రభుత్వ అధికారులకు అప్పగించాడు.
'శ్రమ ఫలించింది'
తాను ఎన్నో గనుల్లో వజ్రాల కోసం వెతికానని తెలిపాడు శంశేర్ ఖాన్. అయితే.. ఇప్పుడు తన శ్రమ ఫలించి, తనకు వజ్రం దొరికిందని సంతోషం వ్యక్తం చేశాడు.
"హీరాపుర్ తపరియన్ ప్రాంతంలోని గనిలో నాకు ఈ వజ్రం లభించింది. ఇది ఆరున్నర క్యారెట్లుగా ఉంది. ఇది దొరకడం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బులను నేను నా వ్యాపారం కోసం వినియోగిస్తాను. ఈ డబ్బులతో నా కుటుంబ జీవితాన్ని మార్చుతాను."
-శంశేర్ ఖాన్, గనిలో పని చేసే వ్యక్తి.
వేలంలో వజ్రం..
శంశేర్ ఖాన్కు దొరికిన వజ్రం మంచి నాణ్యత కలిగిన వజ్రం అని డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. ఇది తక్కువగా ప్రకాశించే రకం వజ్రం అని చెప్పారు. దీని ధర ఎంతుంటుందో ఇప్పుడే తాము కచ్చితంగా అంచనా వేయలేదని... వేలంలో దీని ధర నిర్ణయం అవుతుందని చెప్పారు. వచ్చే వేలంలో ఈ వజ్రాన్ని ఉంచుతామని పేర్కొన్నారు.
తలరాత మార్చే వజ్రాల గనులు..
పన్నాలో చాలా మంది కార్మికులు చిన్నచిన్న గనులను లీజుకు తీసుకుని, వజ్రాల కోసం వెతుకుతుంటారు. అందులో కొంతమందిని మాత్రం అదృష్టం వరించి.. వజ్రాలు దొరుకుతాయి. ముడిరూపంలో దొరికే వజ్రాలను.. డైమండ్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ వారు ఆ వజ్రాలను వేలం వేస్తారు. ఈ వేలంలో పెద్ద పెద్ద వ్యాపారులు, సంస్థలు పాల్గొంటాయి. వేలం వేయగా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని అధికారులు.. వజ్రం యజమానికి అందిస్తారు.
పన్నా జిల్లాలో గతంలోనూ చాలా మందికి వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది 7.44, 14.98 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలు దొరకగా ఇద్దరు కార్మికులు ఒక్కరోజులో లక్షాధికారులు అయ్యారు. ఆ స్టోరీ కోసం ఈ ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చూడండి: