ETV Bharat / bharat

Kota Suicide Cases : కోటాలో ఆగని ఆత్మహత్యలు.. ఇద్దరు NEET విద్యార్థుల బలవన్మరణం - రాజస్థాన్​లోని కోటాలో ఎంతమంది చనిపోయారు

Kota Suicide Cases 2023 : రాజస్థాన్​లోని కోటాలో ఇద్దరు నీట్​ ఆశావహలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి ఒడిగట్టారు. దీంతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 22కు చేరింది.

Kota Suicide Cases 2023
Kota Suicide Cases 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 9:22 AM IST

Kota Suicide Cases 2023 : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రెండు వేర్వేరు ఘటనల్లో ఆదివారం అక్కడ ఇద్దరు నీట్‌ ఆశావహులు బలవన్మరణానికి (Kota Suicide Rate) పాల్పడ్డారు. ఒత్తిడి తట్టుకోలేక శాంభాజీ కస్లే (17), ఆదర్శ్​ రాజ్​ (18) అనే విద్యార్థులు బలవణ్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Kota Suicide Case : మహారాష్ట్రలోని లాతూర్​ జిల్లాకు చెందిన శాంభాజీ కస్లే 12వ తరగతి చదువుతున్నాడు. కోటాలో మూడేళ్లుగా నీట్​కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఆదివారం తాను కోచింగ్‌ తీసుకుంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి అవిష్కర్‌ శంభాజీ కస్లే (17) అనే విద్యార్థి దూకేశాడు. అనతంరం తీవ్రంగా గాయపడిన కస్లేని కోచింట్ సెంటర్ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా.. మర్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

  • #WATCH | Rajasthan | Addl SP Kota, Bhagwat Singh Hinger says, "A student was preparing for NEET coaching. His sister and cousin lived with him. Today, he hanged himself and died by suicide. He had a test today and his sister says that he was scoring less. Suicide note is yet to… pic.twitter.com/4InUcErw51

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో విద్యార్థి సైతం...
బిహార్​.. రోహ్​తాస్ జిల్లాకు చెందిన ఆదర్శ్​ రాజ్​ అనే యువకుడు ఏడాది కాలంగా నీట్ కోచింగ్​ తీసుకుంటున్నాడు. తన సోదరి, సోదరుడితో కలిసి డబుల్ బెడ్​రూం ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతడి సోదరి, సోదరుడు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే కస్లే మరణించిన నాలుగు గంటల తర్వాత.. తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు ఆదర్శ్. ఆదర్శ్​ సోదరి, సోదరుడు తమ ఫ్లాట్​కు చేరుకునేసరికి.. గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తలుపు తెరిచి చూడగా ఆదర్శ్​ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించాడని చెప్పారు. అయితే కొన ఊపిరితో ఉన్న ఆదర్శ్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని తెలిపారు. అయితే వీరి గదుల్లో ఎలాంటి సుసైడ్​ నోట్​లు (Kota Suicide Notes) లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే వీరు రోజువారి టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు.

వీరిద్దరి మృతితో.. ఈ ఏడాది ఇప్పటివరకూ కోటాలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య 22కు (Kota Suicide Data) చేరింది. ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపడుతున్నా ఈ ఘటనలు జరగడం గమనార్హం. కోటాలో కోచింగ్‌ సెంటర్లు (Kota Coaching Centre List) ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు ఇక్కడకు కోచింగ్‌ తీసుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థుల సంఖ్య ఇక్కడ ఏటా పెరుగుతోంది.

Kota Suicide Prevention : ఆత్మహత్యలు ఆపడానికి హాస్టళ్లలో వలలు.. ఫ్యాన్​​లకు స్ప్రింగ్​లు

students suicides in Telangana : చావు పరిష్కారం కాదు.. బతికి సాధిద్దాం బిడ్డా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.