ETV Bharat / bharat

Korutla Deepthi Murder Case Update : వీడిన కోరుట్ల దీప్తి హత్య కేసు మిస్టరీ.. చందన, ఆమె ప్రియుడే హంతకులు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 6:42 PM IST

Korutla Deepthi Murder Case Update : కోరుట్ల దీప్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీప్తిని హత్య చేసింది చెల్లెలు చందన, ఆమె ప్రియుడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దీప్తిని హత్య చేసినట్లు చందన ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Korutla Deepthi Murder Case
Korutla Deepthi Murder Case Update

Korutla Deepthi Murder Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కోరుట్ల దీప్తి హత్య కేసు(Korutla Deepthi Murder Case) మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతురాలి చెల్లెలు చందనే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దీప్తిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అరెస్టు చేసిన వారి నుంచి రూ.1.20 లక్షల నగదు.. 70 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..

"2019లో మృతురాలి చెల్లెలు బంక చందన హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివే సమయంలో.. అదే ప్రాంతానికి చెందిన ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే అక్కడ రెండేళ్ల తర్వాత డిటెయిన్‌ అయింది. వీరిరువురు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నెల 19న కోరుట్ల వచ్చి చందనతో పెళ్లి విషయమై ఉమర్‌ మాట్లాడాడు. ఇంకా జీవితంలో సెటిల్‌ కాలేదని.. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారం తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

10th Class Girl Suicide in Nizamabad : పదో తరగతి బాలిక ఆత్మహత్య.. ప్రేమించి మోసపోయానంటూ సూసైడ్ నోట్

Korutla Deepthi Murder Case Chandana Victim : చందన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో వేడుక ఉందని చెప్పి వెళ్లారు. అప్పుడు చందన ఉమర్‌కు కాల్‌ చేసి.. ఇంట్లో ఎవరూ లేరు కోరుట్ల రావాలని కోరింది. అతను ఆగస్టు 28న అతడు కోరుట్ల చేరుకున్నాడు. వీరి ప్లాన్‌ ప్రకారం ముందుగానే తన అక్క దీప్తికి వోడ్కా, బ్రీజర్‌ను చందన తాగించింది. అనంతరం ఇద్దరూ పడుకున్న తర్వాత చందన.. తన లవర్‌ను ఇంట్లోకి పిలిపించి డబ్బు, బంగారంతో పరారయ్యేందుకు యత్నించింది. ఈ క్రమంలో చప్పుడు కావడంతో లేచిన దీప్తి.. వారిని అడ్డుకోవడంతో చందన వెనుక నుంచి స్కార్ఫ్‌తో గట్టిగా లాగింది.

Korutla IT Employee Deepthi Murder Case : అంతటితో ఆగకుండా ఇద్దరూ కలిసి దీప్తి నోటికి, ముక్కుకు ప్లాస్టర్‌ వేసింది. దీంతో ఆమె ఊపిరి ఆడక చనిపోయింది. అనంతరం ఆమెకు ఉన్న ప్లాస్టర్‌ను తీసి.. సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బంగారం, నగదుతో వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వీరిని ఆర్మూర్‌ వద్ద బాల్కొండ సమీపంలో సాంకేతిక ఆధారంతో పట్టుకున్నాం" అని ఎస్పీ భాస్కర్‌ వివరించారు. ఈ కేసులో చందనను విచారించగా.. ఆమే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భాగమైన చందనను ఏ1గా, ఉమర్‌ను ఏ2గా చేర్చారు. వీరితో పాటు వీరికి సహకరించిన వారిని అరెస్ట్​ చేసి కేసు నమోదు చేశారు.

"2019లో చందన హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌లో చేరింది. అక్కడ బీటెక్‌ చదివే సమయంలోనే ఉమర్‌తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు లేనప్పుడు ఇంచి నుంచి వెళ్లిపోయేందుకు చందన పథకం పన్నింది. బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించుకుంది. అంతకు ముందే అక్క దీప్తికి వోడ్కా తాగించిన చందన.. ఆమె మత్తులో ఉన్నప్పుడు పారిపోవాలని భావించింది. డబ్బు, బంగారంతో పరారయ్యేందుకు చందన, ఉమర్‌ ప్రయత్నించారు. మత్తు నుంచి మేల్కొన్న దీప్తి వారి ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అడ్డు వచ్చిందని దీప్తిని చున్నీతో కట్టేసి.. నోటిలో ప్లాస్టర్‌ కుక్కి ఊపిరాడకుండా చేశారు. దీంతో ఆమె మరణించింది. అనంతరం ఆనవాళ్లు లేకుండా చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశాం" - భాస్కర్‌, జగిత్యాల జిల్లా ఎస్పీ

Korutla Deepthi Murder Case Update వీడిన కోరుట్ల దీప్తి హత్య కేసు మిస్టరీ చందన ఆమె ప్రియుడే హంతకులు

Suspicious Death in Jagtial District : అక్క అనుమానాస్పద మృతి.. చెల్లి అదృశ్యం.. జగిత్యాల జిల్లాలో మిస్టరీ

అసలేం జరిగిందంటే..: జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస్‌, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. దీప్తి హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. చందన బీటెక్‌ చదువుతూ ఇంటి దగ్గరే ఉంటుంది. ఆగస్టు 28న తల్లిదండ్రులు హైదరాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు ఇద్దరూ దీప్తి, చందనతో మాట్లాడారు. ఆ తర్వాత రోజు కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. చందనకు ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. అనుమానం వచ్చి పక్కింటి వారికి చెపితే.. వారు వచ్చి చూసేసరికి దీప్తి చనిపోయింది. ఈ విషయంపై తండ్రి అనుమానాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Jagtial Deepthi Murder Case Update : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మర్డర్​ కేసు.. పోలీసుల అదుపులో చందన..?

Woman Murder in Nanakramguda : నానక్‌రాంగూడలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! గవర్నర్, మహిళా కమిషన్ స్పంద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.