ETV Bharat / bharat

ఆకాశంలో మరో అరుదైన ఘట్టం

ఈ ఏడాదిలో తొలిసారిగా జాన్​ 10న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. అరుణాచల్​ ప్రదేశ్​లో ఇది పాక్షికంగా కనిపించనుంది. ఉత్తర అమెరికా, కెనడా, ఐరోపా, రష్యాలో సంపూర్ణంగా కనిపించనుంది.

author img

By

Published : Jun 5, 2021, 6:21 AM IST

Updated : Jun 5, 2021, 6:30 AM IST

solar eclipse
సూర్యగ్రహణం

ఈ ఏడాది సూపర్ మూన్​, బ్లడ్​ మూన్​, చంద్రగ్రహణాలకు సాక్ష్యంగా నిలిచిన ఆకాశవేదికలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జూన్​ 10న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 1:42 గంటల నుంచి సాయంత్రం 6:41 గంటల మధ్య ఇది ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తెలిపింది. ఈ మేరకు పలు మీడియాలు కథనాలు వెలువరించాయి.

ఈ ఏడాదిలో ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణం ఇదే కావటం గమనార్హం. భారత్​లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లో ఇది పాక్షికంగా కనిపించనుండగా.. ఉత్తర అమెరికా, కెనడా, ఐరోపా​, రష్యాలో సంపూర్ణంగా కనిపించనుంది.

వలయాకార సూర్యగ్రహణం అంటే..?

వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని 'జ్వాలా వలయం'గా పిలుస్తారు. కాగా.. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం డిసెంబర్​ 4న ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: 5జీ కేసులో హీరోయిన్​కు షాక్​- ఎన్ని లక్షలు ఫైన్​ అంటే...

ఇదీ చూడండి: కరిచిందని.. కుక్కను తుపాకీతో కాల్చి..

Last Updated : Jun 5, 2021, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.