ETV Bharat / bharat

పెళ్లికి నో చెప్పిన ఆమెపై 'గంజాయి కేసు' కుట్ర - శోభా విశ్వనాథ్​

తనతో పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నాడు ఓ వ్యక్తి. మాదకద్రవ్యాల అక్రమ నిల్వల కేసులో అరెస్ట్​ చేయించాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆ యువతి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. కేరళ తిరువనంతపురంలో జరిగిన ఘటనలో చివరకు ఏమైంది?

Kerala woman entrepreneur
శోభా విశ్వనాథ్​
author img

By

Published : Jun 27, 2021, 2:25 PM IST

తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో మహిళలపై దాడులు చేసిన ఘటనలు చాలానే వెలుగు చూశాయి. కానీ, ఓ ప్రబుద్ధుడు సినిమాలను తలపించేలా పథకం రచించి.. తన ప్రేమను కాదన్న యువతిని కటకటాలపాలు చేయలనుకున్నాడు. గంజాయి కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేశాడు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది.

ఏం జరిగిందంటే?

తిరువనంతపురంలోని వళుతకాడ్​లో 'వీవర్స్​ విలేజ్​' పేరుతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు శోభా విశ్వనాథ్​. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ఆమెకు తిరువనంతపురంలోని లార్డ్స్​ ఆసుపత్రి సీఈఓ హరీశ్​​ హరిదాస్​తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించాడు హరీశ్​. అందుకు ఆమె నిరాకరించారు. అప్పటి నుంచి హరీశ్​ను దూరం పెట్టారు.

Kerala woman entrepreneur
శోభా విశ్వనాథ్​

శోభపై కోపం పెంచుకున్న హరీశ్​.. ఆమెను జైలుపాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం రచించాడు. ఆమె దగ్గర పనిచేసే వివేక్​ రాజ్​ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జనవరి 21న, యువతికి చెందిన దుకాణంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మాదక ద్రవ్యాల అక్రమ నిల్వ కేసులో ఆమెను అరెస్ట్​ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎంత చెప్పినా లాభం లేకుండా పోయింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు పెద్ద యుద్ధమే చేశారు ఆమె. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కేసును క్రైమ్​ బ్రాంచ్​కు అప్పగించారు.

నిర్దోషిగా తేల్చిన పోలీసులు..

కేసును దర్యాప్తు చేపట్టిన క్రైమ్​ బ్రాంచ్​.. శోభా విశ్వనాథ్​ను నిర్దోషిగా తేల్చారు. ఆమె షాప్​లో కావాలనే గంజాయి ఉంచి.. కేసులో ఇరికించారని తేల్చారు. ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టిపారేశారు.

ఎంతో ఉపశమనంగా ఉంది..

ఈ కేసుపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు శోభా విశ్వనాథ్​. నిజం బయటపడిన నేపథ్యంలో పెద్ద ఉపశమనం లభించిందన్నారు.

Kerala woman entrepreneur
శోభా విశ్వనాథ్​

" భర్త, లవర్​, స్నేహితుడు ఎవరైనా సరే.. చెప్పే మాటను అర్థం చేసుకోవాలి. కాదు అంటే కాదు అంతే. వారు దానిని అర్థం చేసుకుని గౌరవించాలి. రెండేళ్ల క్రితం అతని ప్రతిపాదనను తిరస్కరించా. కేవలం నో చెప్పానని ఇంత పెద్ద పన్నాగంతో నన్ను ఇరికిస్తాడని అనుకోలేదు. కొద్ది నెలలుగా జరిగిన పరిణామాలను నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ భయంతోనే జీవిస్తున్నా. నాకు ఏమి జరుగుతుందనేది నాకు తెలియదు. ఇలాంటి వాటిపై మహిళల కోసం పోరాడతా. చాలా మంది తమకు జరిగిన అన్యాయం గురించి ఫొన్​ చేసి చెబుతున్నారు."

- శోభా విశ్వనాథ్​, మహిళా వ్యాపారవేత్త

ఇదీ చూడండి: వధువు కోసం విల్లు విరిచిన వరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.