ETV Bharat / bharat

కేరళలో కరోనా విజృంభణ- కొత్త కేసులు 31 వేల పైనే - కరోనా కేరళ

దేశంలో కరోనా కేసులు(covid update) భారీగానే నమోదవుతున్నాయి. కేరళలో మరోసారి 31 వేలకు పైగా కేసులు(kerala covid cases) వెలుగులోకి వచ్చాయి. అయితే, పాజిటివిటీ రేటు మాత్రం స్వల్పంగా తగ్గింది. మరోవైపు, శనివారం 65 లక్షలకు పైగా టీకా డోసులను పంపిణీ(vaccination) చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

kerala new covid cases
కేరళ కరోనా కేసులు
author img

By

Published : Aug 28, 2021, 11:16 PM IST

కేరళలో వరుసగా నాలుగో రోజూ 30 వేలకు పైగా కరోనా కేసులు(kerala covid cases) వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 31,265 మందికి కరోనా నిర్ధరణ కాగా.. 153 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో లక్షా 67 వేల నమూనాలను పరీక్షించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

కేరళలో కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. పాజిటివ్ రేటు మాత్రం స్వల్పంగా తగ్గింది. ఆగస్టు 27న 19.22 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. 18.67 శాతానికి పరిమితమైంది.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో 4831 కరోనా ఇన్​ఫెక్షన్ కేసులు(maharashtra covid cases) బయటపడ్డాయి. 126 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 64,52,273కి చేరగా.. మరణాల సంఖ్య 1.37 లక్షలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,821 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తమిళనాడు

తమిళనాడులో కొత్తగా 1551 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 21 మంది చనిపోయారు. 1768 మంది శనివారం కోలుకున్నారు.

సున్నా మరణాలు

దిల్లీలో వరుసగా(delhi covid update) మూడో రోజు కరోనా మరణాలు సున్నాగా రికార్డయ్యాయి. రెండో వేవ్ ప్రారంభమైన తర్వాత ఒకరోజులో కరోనా మరణాలు సంభవించకపోవడం ఇది 18వ సారి కావడం గమనార్హం. కాగా, రాజధానిలో కొత్తగా 29 కేసులు వెలుగులోకి వచ్చాయి. పాజిటివిటీ రేటు 0.04 శాతంగా నమోదైంది.

ఒక్కరోజే 65 లక్షలు

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ(vaccination in india) రికార్డు వేగంతో కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 63 కోట్లు దాటింది. శనివారం ఒక్కరోజే(రాత్రి 7 గంటల నాటికి) 65 లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: 'పండగల వేళ జాగ్రత్త- కరోనాపై అలసత్వం వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.