ETV Bharat / bharat

కార్యకర్త వినూత్న ప్రచారం- ఇల్లంతా 'కాంగ్రెస్' మయం - congress worker paints house with party leaders

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓ కాంగ్రెస్ కార్యకర్త వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. తన ఇంటిని పూర్తిగా కాంగ్రెస్- యూడీఎఫ్ నాయకుల చిత్రాలను గీయించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా పెయింటింగ్​ వేశారు. ఎన్నికలు పూర్తయినా నాయకుల చిత్రాలు అలాగే ఉంచుతానని చెప్పారు.

Kerala polls: Congress worker paints house with faces of party leaders
కార్యకర్త వినూత్న ప్రచారం- ఇళ్లంతా 'కాంగ్రెస్' మయం
author img

By

Published : Apr 3, 2021, 9:20 AM IST

Updated : Apr 3, 2021, 12:38 PM IST

కార్యకర్త వినూత్న ప్రచారం- ఇల్లంతా 'కాంగ్రెస్' మయం

కాంగ్రెస్​పై తనకున్న ప్రేమతో కేరళ కొచ్చిలోని చెరాయ్​కి చెందిన నోబెల్​ కుమార్.. తన ఇంటినే ఎన్నికల ప్రచార కేంద్రంగా మలిచారు. ఇల్లు మొత్తం కాంగ్రెస్-యూడీఎఫ్ నాయకుల చిత్రాలతో పెయింటింగ్ వేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. యూడీఎఫ్ మేనిఫెస్టోను కూడా గోడలపై చిత్రించారు.

Kerala polls: Congress worker paints house with faces of party leaders
కాంగ్రెస్- యూడీఎఫ్ ప్రముఖుల చిత్రాలు

" పెయింటింగ్ వేయటానికి నాకు 8 రోజులు పట్టింది. నా స్నేహితుడు రాధాకృష్ణన్​ నాకు సహకరించారు. రూ. 9వేలు ఖర్చయింది. కాంగ్రెస్​పై నాకున్న ప్రేమతోనే ఇలా చేశాను. ఆ పార్టీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎన్నికల తర్వాత కూడా చిత్రాలను చెరపను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ చిత్రాలు ఇలాగే ఉంటాయి."

-- నోబెల్​ కుమార్, కాంగ్రెస్ కార్యకర్త

కాంగ్రెస్-యూడీఎఫ్ మయం

అంతా కాంగ్రెస్ మయం

ఇంటి గోడలపై కాంగ్రెస్-యూడీఎఫ్​ పార్టీ గుర్తులు, ప్రముఖ నాయకులు, మేనిఫెస్టో, ప్రముఖ పథకాలను రంగురంగుల చిత్రాలుగా వేసి ఆకర్షనీయంగా మలిచారు నోబెల్​.

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పెయింటింగ్స్​

కాంగ్రెస్ కార్యకర్త చిత్రాలతో పెయింటింగ్

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ, కేరళ ప్రతిపక్ష నాయకుడు రమేశ్​ చెన్నితళ, కేరళ మాజీ సీఎం ఒమెన్ చాందీ, వైపిన్ నియోజకవర్గం యూడీఫ్​ అభ్యర్థి దీపక్ జాయ్​.. తదితర ప్రముఖ నాయకుల చిత్రాలు గోడలపై ఉన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ.. కేరళకు 'న్యాయ్'​ పథకాన్ని తీసుకొస్తున్న చిత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 న ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి : కేరళ: ఒకరిది వృద్ధి మాట.. మరొకరిది ఉద్వేగాల బాట

Last Updated : Apr 3, 2021, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.