ETV Bharat / bharat

అక్రమాలను సహించనన్న మంత్రికి బెదిరింపులు

author img

By

Published : Jul 13, 2021, 5:47 PM IST

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల విషయంలో అక్రమాలను సహించబోమని తేల్చి చెప్పిన మంత్రికి బెదిరింపులు వచ్చాయి. కార్యాలయంలోని ల్యాండ్​లైన్​కు ఫోన్​చేసి ఓ వ్యక్తి దుర్భాషలాడాడని కేరళకు చెందిన ఓ మంత్రి పేర్కొన్నారు. వీటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.

Minister K Radhakrishnan threatened over phone
కేరళ మంత్రి కే రాధాకృష్ణన్ బెదిరింపులు

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల దుర్వినియోగం వ్యవహారం బహిర్గతం అయిన తర్వాత తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని కేరళ మంత్రి కె.రాధాకృష్ణన్‌ వెల్లడించారు. ఇటీవల ఓ వ్యక్తి తన కార్యాలయం ల్యాండ్‌లైన్‌ ఫోన్‌కు పలుమార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు.

Minister K Radhakrishnan threatened over phone
మంత్రి కే రాధాకృష్ణన్

అక్రమాలను సహించబోమని తేల్చి చెప్పినందున ఓ వ్యక్తి ఇటీవల ఫోన్‌ చేసి బెదిరించాడని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పేద ప్రజల్ని మోసం చేసే వాళ్లను ఎప్పటికీ ఉపేక్షించబోమని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి స్పష్టంచేశారు. ఫోన్‌ చేసిన వ్యక్తి దుర్భాషలాడటమే కాకుండా బెదిరించాడని, అలాంటి బెదిరింపులకు తాను భయపడబోనన్నారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని ప్రభుత్వం విడిచిపెట్టదని ఇటీవల మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఇలాంటి బెదిరింపు కాల్స్‌ రావడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.