మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఈ.శ్రీధరన్ అధికారికంగా భాజపాలో చేరారు. ఈ మేరకు కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఆర్.కే. సింగ్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. 88ఏళ్ల వయసున్న మెట్రోమ్యాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి మరికొంత మంది ప్రముఖలు చేరుతారని భాజపా భావిస్తోంది.
రాష్ట్రంలో వామపక్షాల పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. శ్రీధరన్ చేరికతో ఈ ఎన్నికల్లో తమ ప్రదర్శన మెరుగవుతుందని కమల శ్రేణులు తెలిపాయి.
ప్రముఖ ఇంజినీర్..
ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తోన్న భాజపా.. కేరళలోనూ వ్యూహాత్మకంగా పావులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఇంజినీర్‌గా సేవలందించి.. మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఈ.శ్రీధరన్‌ను పార్టీలోకి చేర్చుకుంది.
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మెట్రోమ్యాన్ ఇమేజ్ను ఉపయోగించుకోవాలని భాజపా భావిస్తోంది. ఆయనకున్న మంచిపేరు పార్టీకి లాభిస్తుందని విశ్వసిస్తోంది.
ఇదీ చదవండి: 'కేరళ ఎన్నికల్లో మెట్రోమ్యాన్ ప్రభావం తక్కువే'