Kerala High Court Names Child : మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టింది కేరళ హైకోర్టు. వేర్వేరుగా ఉంటున్న ఓ జంట మధ్య వారి పాపకు పేరు పెట్టే విషయంలోనూ వివాదం తలెత్తడం వల్ల.. హైకోర్టే చిన్నారికి నామకరణం చేసింది. జస్టిస్ బెచు కురియన్ థామస్ కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఈ పనికి పూనుకుంది. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి.. పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.
2020 ఫిబ్రవరిలో ఈ జంటకు ఓ కుమార్తె పుట్టింది. ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో దంపతులు వేర్వేరుగా ఉన్నారు. పాప మాత్రం తల్లి వద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడం వల్ల.. ఓ పేరు నమోదు చేసేందుకు ఆమె తల్లి ప్రయత్నించారు. పేరు నమోదుకు కచ్చితంగా తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. దీంతో దంపతులిద్దరూ ఆ చిన్నారికి వేర్వేరు పేర్లు సూచించారు. ఇద్దరూ పట్టు వీడకపోవడం వల్ల.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు చిన్నారి తల్లి. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. చిన్నారికి పేరు పెట్టి సమస్యను పరిష్కరించారు.
ఇంటి పనిని భార్యాభర్తలిద్దరూ సమానంగా చేయాలి!'.. హైకోర్టు వ్యాఖ్యలు..
Household Work Couple : ఆధునిక సమాజంలో ఇంటి పని భారాన్ని.. భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని కొద్ది రోజల క్రితం బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరూ ఉద్యోగాలు చేసినప్పుడు.. ఇంటి పని ఒక్క భార్యే చేయాలనుకోవడం పాత కాలపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది.
అసలేం జరిగిందంటే?
13ఏళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్న 35 ఏళ్ల వ్యక్తి.. తన భార్య నుంచి విడాకులు కోరుతూ 2018లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య.. ఎప్పుడూ తల్లితో ఫోన్లో మాట్లాడుతోందని, ఇంటి పనులు చేయడం లేదని కోర్టుకు తెలిపాడు. అయితే పిటిషనర్ వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు.. అతడి పిటిషన్ను కొట్టివేసింది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వ్యులను బాంబే హైకోర్టులో అతడు సవాల్ చేశాడు. అనంతరం వివిధ కోణాల్లో విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.