ETV Bharat / bharat

డ్రమ్స్​తో దుమ్మురేపుతున్న రెండున్నరేళ్ల బాలుడు.. తెయ్యం ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్​ - రెండున్నరేళ్ల బాలుడి డ్రమ్స్​ ప్రదర్శన వీడియో కేరళ

రెండున్నరేళ్ల బాలుడు డ్రమ్స్​ వాయిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాడు. కేరళ సంప్రదాయ వాద్యం చెండా వాయించి తెయ్యం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చిన్ని చేతులతో వేగంగా, ఉత్సాహంగా డ్రమ్స్​ వాయించిన బాలుడి దృశ్యాలను సెల్​ఫోన్లలో బంధించారు. ఆ బాలుడు వీడియోను మీరు ఓ సారి చూసేయండి.

karala boy teyyam chenda drums performance

author img

By

Published : Mar 24, 2023, 8:49 AM IST

Updated : Mar 24, 2023, 10:02 AM IST

డ్రమ్స్​తో దుమ్మురేపుతున్న రెండున్నరేళ్ల బాలుడు.. తెయ్యం ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్​

ఓ రెండున్నరేళ్ల బాలుడు అద్భుతంగా డ్రమ్స్ వాయిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాడు. కేరళలో తెయ్యం ఉత్సవాల్లో సంప్రదాయ వాద్యం చెండా(డ్రమ్స్​) వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కళాకారులు నృత్యం చేస్తుండగా డ్రమ్స్​ వాయిస్తూ సందడి చేశాడు. అతడే కోజీకోడ్​కు చెందిన రెండున్నరేళ్ల మిహన్.

ఉత్తర కేరళలో తెయ్యం సంప్రదాయ నృత్యం. దీన్ని కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో కూడా పాటిస్తారు. అయితే కోజీకోడ్​లోని అన్నసెరీ మనతనాథ్​ ఆలయంలో మార్చి 14న తెయ్యం ఉత్సవం జరిగింది. ఆ పండగలో ప్రత్యేక ఆకర్షణగా మిహన్ నిలిచాడు. తెయ్యం కళాకారులు నృత్యం చేస్తుండగా బాలుడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కేరళ సంప్రదాయ వాద్యం చెండా(డ్రమ్స్​) కళాకారులు వాయిస్తుండగా.. మిహన్ తన డ్రమ్ముతో వాళ్ల వద్దకు వెళ్లి వాయించాడు. వారిని చూస్తూ అచ్చం అలానే ఉత్సాహంగా డ్రమ్స్​ కొట్టాడు. అది చూసిన తెయ్యం నృత్యకారులు.. మిహన్​ను మధ్యలో ఉంచి.. అతడి చుట్టూ డ్యాన్స్​ చేశారు. కాగా, ఆ బాలుడిని చూసి చెండా వాయిస్తున్న కళాకారులు ఆశ్చర్యపోయారు. చిన్ని చేతులతో వేగంగా డ్రమ్స్​ వాయిస్తున్న బాలుడి దృశ్యాల్ని.. అక్కడ ఉన్నవారు సెల్​ ఫోన్లలో బంధించారు.

కోజికోడ్​లోని పుత్యంగడి ప్రాంతానికి చెందిన ప్రబిల్, అనూష దంపతుల కుమారుడే మిహన్. ప్రబిల్​ వ్యాపారవేత్త కాగా.. అనూష కలెక్టరేట్​లో సర్వేయర్​గా పనిచేస్తోంది. వీరిద్దరూ రోజువారి పనుల్లో బిజీగా ఉంటారు. వాళ్లు వారి ఆఫీస్​లకు వెళ్లే ముందు వారి మిహన్​ను అతడి మామయ్య ఇంట్లో విడిచిపెట్టి వెళతారు. ఓ రోజు మిహన్​ తన మామయ్యతో కలిసి గుడికి వెళ్లాడు. అక్కడ మిహన్​కు అతడి మామయ్య ఓ రోజు చిన్న డ్రమ్​ కొనిచ్చాడు. డ్రమ్​ను గట్టిగా వాయించి పగలగొట్టాడు మిహన్. అనంతరం మరో డ్రమ్​ కొనిచ్చాడు మిహన్ మామ.

karala boy teyyam chenda drums performance
డ్రమ్స్​ వాయిస్తున్న మిహన్

అప్పుడే మిహన్​కు డ్రమ్స్ వాయించడంపై ఆసక్తి పెరిగింది. మిహన్ ఆసక్తిని అతడి మామ గ్రహించాడు. రెండో సారి కొన్న డ్రమ్మును లయబద్దంగా వాయించడం మొదలు పెట్టాడు మిహన్. ఇక అప్పటినుంచి ఎక్కడికి వెళ్లినా, ఏ పండుగ వచ్చినా.. తన తల్లిదండ్రులను డ్రమ్​ కొనివ్వమనేవాడు. సాధారణ సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతారా' సినిమాకు మిహన్ పెద్ద ఫ్యాన్​. అందులోని తెయ్యం వాయించే పాత్రలా నటిస్తాడు మిహన్​. అప్పుడప్పుడు కాంతార సినిమాలో ఉన్న తెయ్యం క్యారెక్టర్​లా శబ్దం చేసేవాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మిహన్​.. భవిష్యత్​లో చెండా వాయించడంలో నిపుణుడు కావాలని.. దాంతో పాటు మిగతా సంగీత వాద్యాలు వాయించడంలో కూడా ఆరితేరాలని కోరుకుంటున్నారు.

డ్రమ్స్​ వాయిస్తున్న బాలుడు

Last Updated : Mar 24, 2023, 10:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.