ETV Bharat / bharat

UP Kaushambi Clashes Today : ఒకే కుటుంబంలో ముగ్గురి హత్యతో ఉద్రిక్తత.. నిందితుల ఇళ్లు, దుకాణాలకు నిప్పు

UP Kaushambi Clashes Today : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యతో ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబిలో ఉద్రిక్తత నెలకొంది. స్థల వివాదం కారణంగా ముగ్గురిని దారుణంగా పదునైన ఆయుధాలతో నరికి చంపారు దుండగులు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు.. నిందితులకు సంబంధించిన ఇళ్లు, దుకాణాలకు నిప్పు పెట్టారు.

Three People Of Same Family Murdered
Three People Of Same Family Murdered
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 10:54 AM IST

Updated : Sep 15, 2023, 11:27 AM IST

UP Kaushambi Clashes Today : ఉత్తర్​ప్రదేశ్​లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆగ్రహంతో నిందితుల ఇళ్లు సహా దుకాణాలకు నిప్పంటించారు గ్రామస్థులు. ఈ ఘటన కౌశాంబి జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. స్థల వివాదం కారణంగానే వీరిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదీ జరిగింది
సందీపన్​ఘాట్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయినుద్దీన్​పుర్​ గౌస్​ గ్రామానికి చెందిన హోరిలాల్​, సుభాష్​కు మధ్య కొన్ని రోజులుగా స్థల వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో నిద్రిస్తున్న హోరిలాల్​ సహా అతడి కూతురు బ్రజ్​కాలీ, అల్లుడు శివ్​సరణ్​ విగతజీవులుగా కనిపించారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి ముగ్గురిని ఎవరో పదునైన ఆయుధాలతో హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆగ్రహంతో నిందితుల​ ఇళ్లు, దుకాణాలకు నిప్పుపెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎస్​పీ బ్రిజేశ్ శ్రీవాస్తవ నేతృత్వంలోనే భారీ ఎత్తున పోలీసు బలగాలు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులు ఒప్పుకోలేదు. నిందితులను అరెస్ట్ చేసేవరకు అంత్యక్రియలు చేయబోమంటూ తేల్చిచెప్పారు.

  • #WATCH | Kaushambi, UP: A triple murder took place over a land dispute in Kaushambi. All the victims were from the same family. Enraged people set fire to many houses.

    Superintendent of Police at Kaushambi, Brijesh Srivastava says, "...The names of four people have come out as… pic.twitter.com/uV91hInDu0

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"శుక్రవారం ఉదయం 6 గంటలకు ముగ్గురి హత్య విషయంపై సమాచారం అందింది. దీనికి స్థల వివాదమే కారణంగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. త్వరలోనే పరారీలో ఉన్న నలుగురు నిందితులను పట్టుకుంటాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది."

--బ్రిజేశ్ శ్రీవాస్తవ, ఎస్​బీ

  • VIDEO | Angry mob sets several houses on fire in UP's Kaushambi following a triple murder over land dispute. More details are awaited. (n/1) pic.twitter.com/F7yVsgbEnX

    — Press Trust of India (@PTI_News) September 15, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

రూ.400 కోసం గొడవ.. ముగ్గురు హత్య
బిహార్ పట్నాలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు మరణించారు. 400 రూపాయల కారణంగా తలెత్తిన గొడవల్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటన ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలోని సురంగాపుర్​ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. రెండు కుటుంబాల మధ్య ఏళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. తాజాగా గురువారం రాత్రి పాల డబ్బులు విషయంలో గొడవ తలెత్తింది. వివాదం మరింత ముదిరి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపుకోగా ముగ్గురు మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. "మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీసుల బలగాలను మోహరించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది." అని ఫతుహా డీఎస్​పీ శ్రీరామ్​ యాదవ్​ తెలిపారు.

  • #WATCH | Patna, Bihar: Three people shot dead in a clash between two groups.

    DSP Fatuha, Siya Ram Yadav says, "All the corpses are being brought in the hospital for postmortem. Police forces have camped at the place of the incident. The situation is normal now. One other person… pic.twitter.com/ZPdFAahDPO

    — ANI (@ANI) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Bus Falls From Flyover Viral Video : ఫ్లైఓవర్​పై​ నుంచి కిందపడ్డ RTC బస్సు.. ఆస్పత్రిలో 20మంది.. డ్రైవర్​ నిద్రమత్తే కారణం!

Father Killed Baby Daughter : మూడోసారీ కూతురే.. నోట్లో తంబాకు కుక్కి చిన్నారిని చంపిన తండ్రి

Last Updated : Sep 15, 2023, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.