ETV Bharat / bharat

Karnataka IT Raid CBDT : కాంట్రాక్టర్ల ఇళ్లలో రూ.102 కోట్ల ఆస్తులు సీజ్.. CBDT ప్రకటన.. 'కాంగ్రెస్ అవినీతి సొమ్మే!'

Karnataka IT Raid CBDT : కర్ణాటకలో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఇళ్లలో నిర్వహించిన సోదాలకు సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటన విడుదల చేసింది. మొత్తం రూ.102 కోట్ల ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపింది.

Karnataka IT Raid
Karnataka IT Raid
author img

By PTI

Published : Oct 16, 2023, 3:41 PM IST

Karnataka IT Raid CBDT : కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.94 కోట్ల నగదును ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లపై చేసిన దాడుల్లో రూ.8 కోట్ల విలువైన ఆభరణాలు, 30 లగ్జరీ వాచీలను సీజ్ చేసినట్లు తెలిపింది. అక్టోబర్ 12న రైడ్లు చేపట్టినట్లు సీబీడీటీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరు ఐటీ విభాగంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీలోని బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు వెల్లడించింది. మొత్తం 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.

"ఈ తనిఖీల ఫలితంగా లెక్కల్లోకి రాని రూ.94 కోట్ల నగదు వెలుగు చూసింది. బంగారు, వజ్రాభరణాలు భారీగా బయటపడ్డాయి. ఆభరణాల విలువ రూ.8 కోట్లుగా తేలింది. మొత్తంగా రూ.102 కోట్ల ఆస్తులు సీజ్ చేశాం. దీంతోపాటు, విదేశాల్లో తయారైన 30 లగ్జరీ వాచీలను.. గడియారాల వ్యాపారంతో సంబంధం లేని ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద నుంచి సీజ్ చేశాం."
-కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటన

IT Raids In Bengaluru : ఈ సోదాల్లో డిజిటల్ డేటా, హార్డ్ కాపీల రూపంలో ఉన్న సాక్ష్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు సీడీబీటీ తెలిపింది. ఖర్చులను ఎక్కువగా చూపించి తమ ఆదాయాన్ని తక్కువగా చూపించేందుకు ఈ కాంట్రాక్టర్లు ప్రయత్నించినట్లు తెలుస్తోందని సీడీబీటీ పేర్కొంది. సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నకిలీ కొనుగోళ్లు, తప్పుడు ఖర్చులు చూపించారని వెల్లడించింది. ఈ అవకతవకల వల్ల లెక్కల్లోకి రాని నగదు భారీగా పోగైందని తెలిపింది.

Karnataka IT Raid
ఐటీ శాఖ సీజ్ చేసిన డబ్బు

Bangalore IT Raid Today : ఎన్నికల ఎఫెక్ట్​.. కార్పొరేటర్ల ఇళ్లల్లో IT సోదాలు​.. మంచం కింద రూ.42 కోట్లు చూసి షాక్​!

కాంగ్రెస్ సొమ్మే ఇది: బీజేపీ
ఈ సోదాలపై కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఐటీ శాఖ జప్తు చేసిన నగదు కాంగ్రెస్​కు చెందినదంటూ బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ అవినీతి సొమ్ము అని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడుకోవడం కాంగ్రెస్​కు కొత్తేం కాదని.. కానీ ఇంత త్వరగా ఇది జరగడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ దీనిపై మౌనంగానే ఉంటారా అని ప్రశ్నించారు.

  • #WATCH | On recovery of Rs 50 crores in raids in Karnataka, BJP leader Ravi Shankar Prasad says, "It is a huge thing that approx Rs 50 crores in cash was seized. This is Congress for cash, for corruption...Rahul Gandhi will you remain silent on this?" pic.twitter.com/45LjlppDCM

    — ANI (@ANI) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Karnataka IT Raid Today : ఆ కాంట్రాక్టర్‌ ఫ్యామిలీ ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.50కోట్లు సీజ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.