చేతికొచ్చిన పంట కోతుల పాలవుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు. ఒకటి రెండు వానరాలనైతే బెదిరించొచ్చు.. కానీ మూకుమ్మడిగా దాడి చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు. వాటి బెడద నుంచి ఎలాగైనా పంటను రక్షించుకోవాలని సంకల్పించుకున్నాడు. ఇందుకోసం వినూత్న రీతిలో ఆలోచించాడు.
పులి నమూనాతో..
హావేరి జిల్లాలోని రట్టిహళ్లి తాలుకా యాదగోడ గ్రామానికి చెందిన బసనగౌడ అనే రైతు.. తన పొలంలో కాఫీ, వక్క పంటలను పండిస్తున్నాడు. దాన్ని కోతుల నుంచి రక్షించేందుకు ఓ పులి నమూనాను తయారు చేయించాడు. కాస్త గంభీరంగా ఉండే పులి బొమ్మను తన పొలంలో ఉంచాడు. దీన్ని చూసిన కోతులు.. అది నిజంగా పులేనని భయపడి.. ఆ పరిసరాల్లోకి రావాలంటేనే జంకుతున్నాయట.
ఇదీ చదవండి: నలుగురిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు అరెస్ట్