ETV Bharat / bharat

కోల్​కతా, బెంగళూరులో 'కొవాగ్జిన్'​ ఫైనల్ ట్రయల్స్

దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​-కొవాగ్జిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ కోల్​కతా, బెంగళూరులో బుధవారం ప్రారంభమయ్యాయి. బంగాల్​లో​ గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​, కర్ణాటకలో సీఎం యడియూరప్ప వ్యాక్సిన్​ ట్రయల్స్​ను ప్రారంభించారు. తుది దశ ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

author img

By

Published : Dec 2, 2020, 2:18 PM IST

Updated : Dec 2, 2020, 6:55 PM IST

Covaxin final trials
కొవాగ్జిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​

దేశీయ ఫార్మా దిగ్గజం భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవిడ్​ వ్యాక్సిన్-​ కొవాగ్జిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ కోల్​కతా, బెంగళూరులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కోల్​కతాలోని ఐసీఎంఆర్​-ఎన్​ఐసీఈడీలో తుది దశ ప్రయోగాలను ప్రారంభించారు బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​.

Covaxin final trials
గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​

దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తుది దశ క్లినికల్​ ట్రయల్స్​కు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు డజన్ల కేంద్రాల్లో ఎన్​ఐసీఈడీ ఒకటని తెలిపారు ధన్​ఖర్​. ఈ ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధి కేవలం దేశంలోని దూరదృష్టి గల నాయకత్వంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.

బంగాల్​ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఫర్హాద్​ హకీమ్​.. కొవాగ్జిన్​ తుది దశ ట్రయల్స్​లో భాగంగా టీకా వేయించుకున్న తొలి వలంటీర్​గా నిలిచారు. అనంతరం.. ఆయన మాట్లాడారు.

''టీకా ట్రయల్స్​లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. టీకా వేయించుకున్నాక నేను బాగానే ఉన్నా. ఇందులో భాగంగా నేను చనిపోయినా పట్టించుకోను.''

- హకీమ్​, బంగాల్​ మంత్రి.

Covaxin final trials
ఐసీఎంఆర్​-ఎన్​ఐసీఈడీలోని ట్రయల్స్​ విభాగం

దేశవ్యాప్తంగా మొత్తం 25,800 మంది వలంటీర్లపై తుది దశ ట్రయల్స్​ నిర్వహిస్తుండగా.. ఐసీఎంఆర్​-ఎన్​ఐసీఈడీలో వెయ్యి మంది ఉన్నట్లు తెలిపారు ఆసుపత్రి డైరెక్టర్​, శాస్త్రవ్తేత డాక్టర్​ శాంత దత్త.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొవాగ్జిన్​ మూడో దశ క్లనికల్​ ట్రయల్స్​ను వర్చువల్​గా ప్రారంభించారు ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప. ఈ ట్రయల్స్​ బెంగళూరులోని వైదేహీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ అండ్​ రీసర్చ్​లో చేపడుతున్నారు. సుమారు 1600-1800 మంది వలంటీర్లపై ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్​. మూడోదశ ప్రయోగాల్లో ఏ వ్యక్తిపైనా ప్రతికూల ప్రభావం చూపకుండా.. విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Covaxin final trials
క్లినికల్​ ట్రయల్స్​ను వర్చువల్​ ప్రారంభిస్తున్న యడియూరప్ప

ఇదీ చూడండి: భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ ప్రయోగాలు ఇలా

Last Updated : Dec 2, 2020, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.