Karnataka cd case: కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సీడీ కేసులో.. ఆ రాష్ట్ర మాజీ మంత్రి రమేశ్ జర్ఖిహోళికి క్లీన్ చిట్ ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్). జర్ఖిహోళి అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. కేసును మూసివేసేందుకు కోర్టుకు 'బీ' నివేదికను సమర్పించింది దర్యాప్తు బృందం.
సీడీ కేసు విషయంపై రాష్ట్రంలో దుమారం చెలరేగిన క్రమంలో.. తన మంత్రి పదవికి గత ఏడాది మార్పి 4న రాజీనామా చేశారు జర్ఖిహోళి.
కేసు ఏమిటి?
మాజీ మంత్రి రమేశ్.. ఓ మహిళతో అసభ్యకరమైన రీతిలో ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది. అనంతరం దానిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అయితే రమేశ్‌తో వీడియోలో ఉన్నట్లుగా భావిస్తున్న మహిళ.. సీడీలో ఉన్నది తాను కాదని అనేక వీడియోలు, ఆడియోలు విడుదల చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది.