ETV Bharat / bharat

'మతమార్పిడి వ్యతిరేక బిల్లు'కు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం - Protection of Right to Freedom of Religion Bill, 2021

Karnataka Anti Conversion Bill: వివాదాస్పద 'మతమార్పిడి వ్యతిరేక బిల్లు'ను కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన తెలిపాయి. కొంతమంది సభ్యులు స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లారు.

Karnataka Anti Conversion bill
మతమార్పిడి వ్యతిరేక బిల్లు
author img

By

Published : Dec 23, 2021, 6:01 PM IST

Updated : Dec 23, 2021, 7:15 PM IST

Karnataka Anti Conversion Bill: వివాదాస్పద 'మతమార్పిడి వ్యతిరేక బిల్లు'ను కర్ణాటక అసెంబ్లీ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీయూ తీవ్ర నిరసన తెలిపాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

'మేమంతా ఆర్​ఎస్​ఎస్ నుంచి వచ్చినవారమే. దేశాన్ని రక్షించాలని ఆర్​ఎస్​ఎస్ చెబుతుంది. ఈ దేశ సంస్కృతిని, మతాలను పరిరక్షించాలని ఆకాంక్షిస్తుంది. అందుకే మేము ఈ బిల్లును తీసుకొచ్చాము.' అని సభలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఈశ్వరప్ప అన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది.

ఓటు బ్యాంకు రాజకీయాలు ..

Karnataka Anti Conversion Bill Passed: కాంగ్రెస్​పై అధికార భాజపా విరుచుకుపడింది. సిద్ధరామయ్య హయాంలోనే 2016లో ఈ బిల్లును తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆరోపించింది. సమాజ క్షేమం కోసమే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. భాజపా ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. ఈ బిల్లు వెనుక ఆర్​ఎస్​ఎస్​ ఉందని ఆరోపించారు.

What is Anti Conversion Bill:

'కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు-2021' పేరిట తీసుకువచ్చిన ఈ బిల్లు ద్వారా బలవంతపు మత మార్పిళ్లను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 25 భారతీయ పౌరులు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు హక్కును కల్పిస్తోంది. అయితే, బలవంతపు మార్పిళ్లను నిషేధిస్తోంది. ఈ నిబంధనకు లోబడి.. బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించనుంది కర్ణాటక ప్రభుత్వం.

కొత్త బిల్లు ప్రభారం బలవంతంగా, బెదిరించి మత మార్పిడికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గంలోని మహిళలు, మైనర్లు, బధిరులను మతమార్పిడి చేస్తే కనీసం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే, ఇతర కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులను మతం మారేలా ప్రేరేపిస్తే.. గరిష్ఠంగా 5 ఏళ్ల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు. సామూహిక మత మార్పిళ్లు చేస్తే.. 3-10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మతాన్ని మార్చాలనే ఉద్దేశంతో డబ్బులు, కానుకలు, ఉపాధి, ఉచిత విద్య, వివాహాలు, మంచి జీవన విధానం వంటివి చూపించి ఆకర్షించే ప్రయత్నాలను సైతం నేరంగా పరిగణించనున్నారు. ఇలాంటి వాటిలో పాల్గొనే ఎన్​జీఓలు, మతపరమైన మిషనరీలు​, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, విద్యా సంస్థలకు నిధులను నిలిపివేయనున్నారు. బలవంతపు మత మార్పిడి ఏ విధంగా జరిగినా నాన్​బెయిలబుల్​ నేరంగా పరిగణిస్తారు. మతమార్పిడి నిరూపితమైతే.. బాధితుడికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ తరహా చట్టాన్ని అమల్లోకి తెచ్చాయి.

Anti Conversion Laws in India:

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​ 295ఏ, 298 ప్రకారం.. బలవంతపు మతమార్పిడి అనేది నేరంగా పరిగణిస్తున్నారు. అయితే, చట్ట వ్యతిరేకమని ఈ సెక్షన్లు నేరుగా చెప్పటంలేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చాయి. స్వాతంత్ర్యానికి ముందు నుంచే పలు చట్టాలు అమలులో ఉన్నాయి. 1936లో రాయ్​గఢ్​ స్టేట్​ ట్రాన్స్​ఫర్​ యాక్ట్​, 1942లో పట్నా రిలీజియస్​ ఫ్రీడమ్​ యాక్ట్​, 1945లో సర్గుజా స్టేట్​ అపాలజెటిక్స్​ యాక్ట్​ వంటివి అమలు చేశారు.

ఇదీ చదవండి:

ఇదీ చూడండి:

'లవ్ జిహాద్' ఆర్డినెన్స్ తెచ్చిన మధ్యప్రదేశ్​

బాలికతో మత మార్పిడి- యువకుడి అరెస్ట్​

'లవ్​ జిహాద్' ఆర్డినెన్సుపై మాయ అనుమానాలు

Last Updated : Dec 23, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.