డీఎంకే వైఖరిపై మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ మండిపడ్డారు. తమ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను డీఎంకే కాపీ కొట్టిందన్నది కేవలం ఆరోపణలే కాదని.. అవి నిజాలు కూడా అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని డీఎంకే అంగీకరించాలని పేర్కొన్నారు. 'ఒకవేళ వారు మరిన్ని అంశాలను కాపీ కొట్టాలనుకుంటే మా వద్ద అందుకు తగిన ప్రణాళికలు ఉన్నాయి' అని పేర్కొన్నారు.
అయితే మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు అవసరమని.. అధికారంలోకి ఎవరొచ్చినా వీటిని అమలు చేయాలన్నారు కమల్.
అసలేం జరిగింది ?
గతేడాది ఫిబ్రవరిలో.. 'రీ ఇమేజింగ్ తమిళనాడు' పేరుతో గృహిణుల కోసం చేపట్టే చర్యలను మక్కల్ నీది మయ్యమ్ ప్రకటించింది. ఇటీవల డీఎంకే ప్రకటించిన మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని పేర్కొనడం వివాదానికి దారితీసింది.
ఇదీ చదవండి : చైనాకు చెక్ పెట్టేలా భారత సైన్యం 'విన్యాసాలు'!