రాజస్థాన్ జోధ్‌పుర్ జిల్లాలోని భూంగ్రా గ్రామంలో ఓ వివాహ వేడుకలో ఐదు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. అయితే ఈ ఘటనలో బాధితులకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మహాత్మాగాంధీ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు మృతుల బంధువులు. కాగా అంతకుముందు ప్రభుత్వం రూ. 17 లక్షల ప్యాకేజీని ప్రకటించింది.
బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తామన్న రూ.17 లక్షల పరిహారాన్ని రూ.50 లక్షలకు పెంచాలని.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం వల్ల చివరికి రూ.17 లక్షల ప్యాకేజీనే మృతుల కుటుంబసభ్యులు అంగీకరించారు.