ETV Bharat / bharat

పోలీస్​ స్టేషన్ క్లీన్​ చేస్తుండగా భారీ పేలుడు.. ఐదుగురు...

పోలీస్​ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

police station blast
గాయపడిన సిబ్బందికి వైద్యం చేస్తున్న డాక్టర్లు
author img

By

Published : Nov 21, 2021, 7:26 PM IST

ఝార్ఖండ్​ పాలము జిల్లాలో చైన్​పుర్​ పోలీస్​స్టేషన్​ ఆవరణలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.

స్టేషన్​లో ఉండే చెత్తను శుభ్రపరిచి కాల్చుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై కచ్చితమైన సమాచారం లేదని తెలిపిన సిబ్బంది... చెత్తలో ఉండే పెట్రోల్​ బాటిల్​ వేడికి పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు.

police station blast
పేలుడులో గాయపడిన సిబ్బంది
police station blast
గాయపడిన సిబ్బందికి వైద్యం చేస్తున్న డాక్టర్లు

గాయపడిన వారిలో నలుగురు వాచ్‌మెన్​లతో పాటు ఒక కానిస్టేబుల్‌ ఉన్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉండే మేదినీరాయ్​ మెడికల్​ కాలేజ్​కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో వాచ్‌మెన్ నందు మాంఝీ పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై సీనియర్​ అధికారులతో కూడిన ఓ బృందం దర్యాప్తు చేస్తుందని పాలము ఎస్​పీ చందన్​ కుమార్​ సిన్హా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చిన్నారిని కిడ్నాప్ చేసి.. నోట్లో తుపాకీ పెట్టి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.