ETV Bharat / bharat

నాన్న వెల్డర్.. కొడుకు జేఈఈ టాపర్.. 99.938% స్కోర్​!

తండ్రి వెల్డింగ్ పనిచేసే ఓ సాధారణ కార్మికుడు. రోజూ పనికి వెళ్తేనే ఇంట్లోని నలుగురి కడుపు నిండుతుంది. ఆన్​లైన్​ క్లాస్​లు వినేందుకు స్మార్ట్​ఫోన్ కొనడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. అయినా.. పేదరికం తన లక్ష్యసాధనకు అడ్డంకి కాదని నిరూపించాడు ఓ విద్యార్థి. జేఈఈ మెయిన్స్ తొలి ప్రయత్నంలోనే 99.938శాతం స్కోర్ సాధించాడు.

jee mains 2022 topper
దీపక్ ప్రజాపతి
author img

By

Published : Jul 13, 2022, 3:37 PM IST

అత్యంత క్లిష్టతరమైన జేఈఈ మెయిన్స్​(రౌండ్​ వన్) పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే 99.938శాతం స్కోర్​ సాధించి ఔరా అనిపించాడు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థి. సంకల్పం, అంకిత భావంతో ముందుకు సాగితే.. పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించాడు.
ఈ ఘనత సాధించిన దీపక్ ప్రజాపతి.. మధ్యప్రదేశ్​లోని దేవాస్​ వాసి. అతడి తండ్రి రామిక్బాల్ వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. పేదరికం కారణంగా తాను పడుతున్న కష్టాలు తన పిల్లలకు రాకూడదని భావించారు రామిక్బాల్. అందుకే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వారిని చదివిస్తున్నారు.

jee mains 2022 topper
తరగతి గదిలో దీపక్ ప్రజాపతి

"మా ఆర్థికి పరిస్థితి ఏమీ బాగాలేదు. నలుగురు కుటుంబసభ్యులం కలిసి ఒకే గదిలో ఉంటాం. 8వ తరగతి వరకు ఓ చిన్న పాఠశాలలో చదువుకున్నా. తర్వాత కరోనా లాక్​డౌన్ కారణంగా చదువు కష్టమైంది. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు స్మార్ట్​ఫోన్​ కోసం అప్పు చేయాల్సి వచ్చింది. 11వ తరగతి నుంచి జేఈఈ కోసం సన్నద్ధమవడం ప్రారంభించా. నా చదువు​ కోసం మా నాన్న బంధువుల దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. నా ఆర్థిక పరిస్థితి చూసి ఓ ప్రైవేటు కోచింగ్ సంస్థ ఉచితంగానే జేఈఈ శిక్షణ ఇచ్చింది. ఐఐటీ ఇంజినీరింగ్ చదవాలన్నదే నా కల. కంప్యూటర్​ సైన్స్​ ఇంజినీరింగ్ కోర్స్​లో చేరాలని అనుకుంటున్నా" అని తన కష్టాల సవారీని, భవిష్యత్​ లక్ష్యాలను వివరించాడు దీపక్ ప్రజాపతి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.