ETV Bharat / bharat

Jammu Kashmir Election : 'జమ్ముకశ్మీర్​లో ఏ క్షణమైనా ఎన్నికలు.. తుది నిర్ణయం వారిదే' - జమ్ముకశ్మీర్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం

Jammu Kashmir Election Supreme Court : జమ్ముకశ్మీర్​లో ఏ క్షణమైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్​, రాష్ట్ర పోల్​ ప్యానెల్​ నిర్ణయించాలని తెలిపింది.

Jammu And Kashmir Election Supreme Court

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 11:29 AM IST

Updated : Aug 31, 2023, 12:24 PM IST

Jammu And Kashmir Election Supreme Court : జమ్ముకశ్మీర్​లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. ఈ మేరకు సొలిసిటర్​ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలియజేశారు. జమ్ముకశ్మీర్​లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. తొలుత పంచాయతీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని తెలిపారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Article 370 Hearing Update : అయితే జమ్ముకశ్మీర్​లో ఓటర్ల జాబితాను అప్డేట్​ చేసే పని జరుగుతోందని.. అది పూర్తి కావడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుందని సుప్రీంకు మెహతా తెలిపారు. దీంతో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు (Jammu Kashmir Statehood Restoration) కొంత సమయం పడుతుందని తెలియజేశారు. లద్దాఖ్ హిల్​ డెవలప్​మెంట్ కౌన్సిల్, లేహ్​లో ఎన్నికలు ముగిశాయని.. ఇక వచ్చే నెలలో కార్గిల్​లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. జమ్మకశ్మీర్​లో 2018తో పోలిస్తే ఇప్పటి వరకు తీవ్రవాద సంబంధిత సంఘటనలు 45.2 శాతం తగ్గాయని.. చొరబాటు యత్నాలు 90.2% తక్కువయ్యాయని సుప్రీంకోర్టుకు నివేదించారు.

కేంద్రం సమర్పించిన ఉగ్రవాద సంబంధింత ఘటనల డేటాను సుప్రీం రికార్డు చేయడంపై.. పటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్​ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ డేటా అధికరణ 370 సమస్య విచారణను ప్రభావితం చేయదని ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హామీ ఇచ్చారు.

Article 370 Hearing In Supreme Court : అంతకుముందు అధికరణ 370 రద్దుపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్​కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని.. దీనిపై పూర్తి వివరాలతో గురువారం (2023 ఆగస్టు 31) వివరణాత్మక ప్రకటన చేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది కేంద్ర ప్రభుత్వం.

'కశ్మీర్​లో 2019 ఆగస్టు ముందు పరిస్థితులు కావాలి'

'కశ్మీర్​వాసుల్లో అపనమ్మకం తొలగించాలి'

Last Updated : Aug 31, 2023, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.