రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పార్క్ చేయటం తమ పనే అని జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ మేరకు ముంబయికి చెందిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
టెలిగ్రామ్ యాప్‌లో ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్టు విస్తృతంగా ప్రచారం జరగుతుండటం వల్ల ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు.
ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేగింది.
ఇదీ చూడండి: అంబానీ ఇంటి వద్ద కలకలం- లేఖలో తీవ్ర హెచ్చరికలు