అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భద్రతా బలగాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది గల్వాన్, లద్దాఖ్ వద్ద 18 వేల అడుగుల ఎత్తులో ఆసనాలు వేశారు. ఎముకలు కొరికే చలినీ లెక్క చేయలేదు.
మరికొంత మంది లద్దాఖ్ సరిహద్దు 15వేల అడుగుల ఎత్తులో వద్ద యోగా చేశారు.
ఇంకొంత మంది లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో నది వద్ద యోగాసనాలు వేశారు. జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అధికారులు యోగా చేశారు.
గుర్రాలపై యోగా..
అరుణాచల్ ప్రదేశ్ లోహిత్పుర్లోని పశు శిక్షణా కేంద్రం వద్ద ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు.. గుర్రాలపై యోగా చేశారు.
ఇదీ చదవండి: విపత్తువేళ అభయ యోగా- జనారోగ్యానికి మార్గం