చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని(యూఏపీఏ) వివరించడాన్ని ఓ సమస్యగా సుప్రీంకోర్టు పేర్కొంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. దిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురు విద్యార్థి నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ పోలీసులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపింది ధర్మాసనం. దీనిపై స్పందన తెలిపాలని ముగ్గురు ఆందోళనకారులను ఆదేశించింది.
హైకోర్టు తీర్పును చూసి కింది కోర్టులు కూడా ఇలాంటి కేసుల్లో నేరస్థులకు ఉపశమనం కల్పించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ముగ్గురు విద్యార్థుల బెయిల్పై స్టే విధించబోమని స్పష్టం చేసింది.
దిల్లీ అల్లర్ల ఘటనపై దేశద్రోహం కేసు నమోదైన ముగ్గురు విద్యార్థి నాయకులు నర్వాల్, కలిత, తాన్హలకు హైకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది.
తీర్పు సందర్భంగా చట్టవ్యతిరేక కర్యకలాపాల నిరోధక చట్టం గురించి చర్చిస్తూ 100 పేజీల వివరణ ఇచ్చింది.
యూఏపీఏ చట్టాన్ని చదవడం అనేది ఇబ్బంది కరమైన అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది.