ETV Bharat / bharat

'పీఎస్​ఎల్​వీ-సీ51' రాకెట్ ప్రయోగానికి రిహార్సల్స్​ పూర్తి

శ్రీహరికోట నుంచి ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్​వీ-సీ51 రాకెట్​కు సంబంధిచిన రిహార్సల్స్​ను ఇస్రో పూర్తి చేసింది. అయితే ఆనంద్‌ ఉపగ్రహాన్ని, నానో శాటిలైట్ ఐఎన్​ఎస్​-2డీటీని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగంలో భాగం చేయడం లేదని అధికారులు తెలిపారు.

ISRO
'పీఎస్​ఎల్​వీ-సీ51' రాకెట్ ప్రయోగానికి రిహార్సల్స్​ పూర్తి
author img

By

Published : Feb 26, 2021, 5:36 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ఈనెల 28న పీఎస్​ఎల్​వీ-సీ51 రాకెట్‌ను ప్రయోగించనున్న నేపథ్యంలో గురువారం అన్ని రిహార్సల్స్‌ పూర్తిచేసింది. ఆదివారం ఉదయం 10 గంటల 24 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 18 ఉపగ్రహాలతో రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది.

ఈ ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియాతో-1తోపాటు పలు వర్సిటీల విద్యార్థులు తయారుచేసిన నాలుగు యూనిటీ శాట్స్‌ ఉపగ్రహాలు, సతీష్‌ ధావన్‌ శాట్‌–1 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించనుంది. అయితే ఇస్రో అంకుర సంస్థ పిక్సెల్ తయారు చేసిన ఆనంద్‌ ఉపగ్రహాన్ని, నానో శాటిలైట్ ఐఎన్​ఎస్​-2డీటీని సాంకేతిక కారణాల వల్ల పంపించడం లేదని అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.