ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ఐసోలేషన్​ తప్పనిసరి కాదు - అంతర్జాతీయ ప్రయాణికులకు ఐసోలేషన్​ నియమాలను సవరించిన కేంద్రం

Corona isolation rules for foreigners: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్​ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాజిటివ్​ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్​ తప్పనిసరి కాదని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

isolation rules for foreigners
విదేశీయులకు ఐసోలేషన్​ తప్పనిసరి కాదు
author img

By

Published : Jan 21, 2022, 12:55 PM IST

isolation rules for foreigners: ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఐసోలేషన్​ నిబంధనలను మార్చింది కేంద్రం. ఎయిర్​పోర్ట్​లో జరిపిన పరీక్షల్లో పాజిటివ్​​ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం​ తప్పనిసరి కాదని తెలిపింది. వారు సాధారణ కొవిడ్​ ప్రోటోకాల్​ అనుసరిస్తే సరిపోతుందని పేర్కొంది.

ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శకాలలో మిగిలిన నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం. స్క్రీనింగ్ సమయంలో వైరస్​ లక్షణాలను గుర్తించినట్లైతే ఆ ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్​కు వెళ్లాలని కొవిడ్​ ప్రొటోకాల్​ చెబుతోంది. అంతేగాకుండా వారి ప్రైమరీ కాంటాక్ట్​లను కూడా గుర్తించి పరీక్షలు నిర్వహించాలి.

భారత్​కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్​ వచ్చిన తరువాత 7 రోజులు హోం క్వారెంటైన్​లో ఉండాలి. 8 వ రోజు నెగటివ్​ వచ్చిన తరువాత కూడా వారు మరో 7 రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.