ETV Bharat / bharat

'మోదీ దేవుడా? మానవాతీత శక్తా?'

author img

By

Published : Apr 4, 2021, 3:30 PM IST

బంగాల్​లో భాజపా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పడానికి ప్రధాన నరేంద్ర మోదీ 'దేవుడా, మానవతీత శక్తా' అని ఎద్దేవా చేశారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. మైనారిటీ ఓట్లు కొల్లగొట్టడానికి ఓ వ్యక్తికి భాజపా డబ్బులు ముట్టజెప్పిందని అబ్బాస్​ సిద్ధిఖీపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.

Is he god or superhuman: Mamata takes swipe at PM Modi for predicting BJP victory in assembly polls
'మోదీ దేవుడా, మానవతీత శక్తా?'

బంగాల్​ ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తోందని ప్రధాని మోదీ జోస్యం చెప్పడాన్ని విమర్శించారు తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. రాష్ట్రంలో ఆరు దశల ఎన్నికలు మిగిలుండగానే.. "భాజపా విజయం సాధించినట్లు ప్రకటించడానికి ప్రధాని నరేంద్ర మోదీ 'దేవుడా లేదా మానవాతీత శక్తా'" అని ప్రశ్నించారు. హూగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మమత.

మైనారిటీ ఓట్లను కొల్లగొట్టడానికి ఓ వ్యక్తికి(ఇండియన్​ సెక్యులర్​ ఫ్రంట్​ వ్యవస్థాపకుడు అబ్బాస్​ సిద్ధిఖీ)భాజపా డబ్బులు ఇచ్చిందని పరోక్షంగా ఆరోపించారు మమత. ప్రధాని బంగ్లాదేశ్ పర్యటనను తప్పుబట్టారు. ఆయన పర్యటన ఆ దేశంలో అల్లర్లకు దారి తీసిందని ఆరోపించారు.

ఇదీ చూడండి: మమత ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.