Iron block on Train Track In Karnataka : చామరాజనగర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైలును పట్టాలు తప్పించడానికి కొందరు దుండగులు కుట్ర పన్నడం కలకలం రేపింది. పట్టాలకు అడ్డంగా ఇనుప ముక్క, కర్రను ఉంచారు. వాటిని గమనించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. నవంబర్ 12 సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..
నవంబర్ 12 వ తేదీ సాయంత్రం 06275 నంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలు చామరాజనగర్ నుంచి మైసూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో కర్ణాటకలోని నంజన్గుడు, కడకోల రైల్వే స్టేషన్ల మధ్య కొందరు దుండగులు రైలు ట్రాక్‌పై ఇనుప ముక్క, కర్రను ఉంచారు. వీటిని గమనించిన లోకోపైలట్.. వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. దీంతో వేలాది మంది ప్రయాణీకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా రైలు కొంత సమయం నిలిచిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సోమయ్ మారాండి అనే వ్యక్తితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన సహచరులతో కలసి ఈ నేరానికి పాల్పడినట్లుగా నిందితుడు సోమయ్ అంగీకరించాడు. ముగ్గురు నిందితులపై రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు.
లోకోపైలట్‌కు అభినందనలు..
లోకోపైలట్ సమయస్పూర్తి వల్ల అనేక మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా లోకోపైలట్‌ను డివిజినల్ రైల్వే మేనేజర్ శిల్పి అగర్వాల్ అభినందించారు. ప్రయాణికుల భద్రత యోగక్షేమాలును ఆయనని అడిగి తెలిసుకున్నారు. రైలు ట్రాక్‌లపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇలాంటి ఘటన ఈ ఏడాది ఆగస్టులో జరిగింది. అహ్మదాబాద్-పురీ రైలుతో పాటు మరో ట్రైన్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించడానికి గుర్తుతెలియని వ్యక్తులు కుట్ర పన్నారు. పట్టాలకు అడ్డంగా ఇనుప స్తంభాలను ఉంచారు. పైలట్ల అప్రమత్తతో రెండు రైళ్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Agra Train Accident : రైలులో ఒక్కసారిగా మంటలు.. రెండు బోగీలు దగ్ధం