భారీ మొత్తంలో హెరాయిన్‌ను తరలిస్తున్న ఇరాన్‌కు చెందిన ఓ పడవను (Boat carrying drugs in India) గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat ATS), కోస్ట్ గార్డ్ సిబ్బంది (Indian Coast Guard) పట్టుకున్నారు. భారత జలాల్లోకి ప్రవేశించిన ఈ పడవను.. గుజరాత్ తీరంలో అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉన్న ఏడుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. వీరంతా ఇరాన్ దేశస్థులేనని అధికారులు తెలిపారు.
పడవలో 30 నుంచి 50 కేజీల మాదకద్రవ్యాలు (Drugs seized in India) ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.150 నుంచి రూ.250 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. అయితే, పడవను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే అందులో ఎంతవరకు డ్రగ్స్ ఉన్నాయో చెప్పగలమని అన్నారు.
ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు ముందుగానే సమాచారం అందించాయని గుజరాత్ డిఫెన్స్ పీఆర్ఓ వెల్లడించింది. దీంతో తక్షణమే అప్రమత్తమై ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు తెలిపారు. పడవను దగ్గర్లోని పోర్టుకు తరలించినట్లు గుజరాత్ డిఫెన్స్ పీఆర్ఓ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలకు 3.92 లక్షల మంది బలి!