ETV Bharat / bharat

ఇక్బాల్‌ మిర్చి ఆస్తులు స్వాధీనం: ఈడీ - మాఫియా నేత ఇక్బాల్​ మిర్చి

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ముఖ్య అనుచరుడైన ఇక్బాల్​ మిర్చి ఆస్తులను జప్తు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. ముంబయిలో ఇక్బాల్​కు చెందిన రూ. 500 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.

Iqbal Mirchi's assets worth Rs 500 crore seized by ED in Mumbai
ఇక్బాల్‌ మిర్చి ఆస్తుల స్వాధీనం: ఈడీ
author img

By

Published : Nov 19, 2020, 7:32 AM IST

మాఫియా నేత ఇక్బాల్‌ మిర్చికి చెందిన ముంబయిలోని రూ.500 కోట్ల విలువైన మూడు ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తెలిపింది. స్మగ్లింగ్‌, మాదకద్రవ్యాల సరఫరా, విదేశీమారక ద్రవ్య అక్రమాల నిరోధక చట్టాల కింద ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది ఈడీ.

ఇక్బాల్​కు సంబంధించిన వర్లి ప్రాంతంలోని మూడు భవనాల(స్థిరాస్తులు)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం అధికారులు. దావూద్‌ ఇబ్రహీంకు కుడిభుజంగా భావించే ఇక్బాల్‌ మిర్చి 2013లో లండన్‌లో చనిపోయాడు.

ఇదీ చదవండి: దావూద్​ ఇబ్రహీం ఆస్తుల వేలంపాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.