ETV Bharat / bharat

'సాగుచట్టాలపై విపక్షాలది రాజకీయ వంచన' - ఓపెన్ మేగజైన్ పీఎం మోదీ

నూతన సాగు చట్టాలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడాన్ని 'రాజకీయ ద్రోహం'గా అభివర్ణించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వ్యవసాయంలో సంస్కరణల కోసం ఒకప్పుడు తామే హామీలిచ్చి ఇప్పుడు మాట మార్చి, వాటిని తప్పుడు అంశాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయని ధ్వజమెత్తారు.

pm modi interview
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ
author img

By

Published : Oct 2, 2021, 2:46 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాల వైఖరిని మోసం, రాజకీయ ద్రోహంగా అభివర్ణించారు. దశాబ్దాలుగా ప్రజలకు అందని ప్రయోజనాల్ని కల్పించే క్రమంలో క్లిష్టమైన, పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.

'ఏదైనా రాజకీయ పార్టీ తాము చేసిన హామీలను నెరవేర్చనప్పుడు.. వాటిని ఇతర పార్టీలు నెరవేరిస్తే.. వాటిని అవసరం లేనివిగా, అసహ్యకరమైనవిగా మార్చి ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తాయి' అని అన్నారు మోదీ. ఈ మేరకు ఓపెన్​ మేగజైన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"వ్యవసాయంలో సంస్కరణల కోసం తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారిని చూస్తే.. నిజాయితీ లేమి, రాజకీయ మోసం అనే పదాలకు అసలైన అర్థం కనిపిస్తుంది. మేం తీసుకువచ్చిన ఈ చట్టాలను తీసుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రులకు ఒకప్పుడు వీరే లేఖలు రాశారు. వీరే తాము అధికారంలోకి వస్తే ఈ సంస్కరణలను తీసుకువస్తామని తమ మేనిఫెస్టోల్లోనూ హామీలిచ్చారు. కానీ, ఇప్పుడు వేరే రాజకీయ పార్టీ వాటిని అమల్లోకి తేవడం వల్ల వారు దానిపై యూటర్న్ తీసుకున్నారు. అందుకే వాటిని వ్యతిరేకిస్తూ.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు."

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కలిసి చర్చించేందుకు సిద్ధమేనని తాము మొదటి నుంచి చెబుతున్నామని మోదీ పేర్కొన్నారు. "ఇప్పటికే చాలాసార్లు సమావేశమైనా.. తాము వ్యతిరేకించడానికి ఓ ప్రత్యేకమైన కారణాన్ని ఎవరూ చెప్పలేకపోయారు" అని అన్నారు.

దేశం విజయం కోసం..

"భారత్​లోని రాజకీయ పార్టీలు తాము వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే పాలన కొనసాగిస్తున్నాయి. కానీ, దేశం విజయ పథంలో వెళ్లాలనే లక్ష్యంతో మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము" అని మోదీ స్పష్టం చేశారు. తాను 'ప్రజాబలం' అనే కోణంలో ప్రజలను చూస్తుంటే.. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీ వర్గాలు 'అధికార బలం' కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్​ ఎంతో సాధించిందని అన్నారు.

కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందన్న విమర్శలను మోదీ ఖండించారు. "భారత్​ పేరును చెడగొట్టడమే కొందరి ఏకైక లక్ష్యం. కరోనాతో అన్ని దేశాలు సమానంగా ప్రభావితమయ్యాయి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే వైరస్​ను ఎదుర్కోవడంలో భారత్​ మెరుగ్గా పని చేసింది" అని మోదీ స్పష్టం చేశారు. సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసి ఆత్మనిర్భరతను సాధించిందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: జల్​ జీవన్ మిషన్ యాప్​ను ఆవిష్కరించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.