ఏదైనా విషపురుగు కనిపించిందంటేనే ఆమడదూరం పరిగెడతాం. అదే నాగుపాము అంటే ఇంకా బెంబేలెత్తిపోయి భయంతో వణికిపోతాం. అలాంటి మూగజీవి బాధలో ఉంటే ఎవరైనా దాని వైపు కన్నెత్తి అయినా చూడరు. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా గాయపడిన ఆ విషసర్పానికి వైద్యచికిత్స అందించారు. నాగుపాముకు వైద్యచికిత్స ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అయితే అదేంటో మీరే చూడండి.
అసలేెం జరింగిందంటే: మానవీ పట్టణం కరాదిగుడ్డ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్లో తాచు పాము చిక్కుకుపోయింది. దీంతో పాముకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పాముల సంరక్షకుడు రమేశ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పామును జంతు వైద్యశాలకు తరలించాడు. ఆసుపత్రి వైద్యుడు రాజు కంబలే పాముకి మత్తు మందు ఇచ్చి వైద్యం ప్రారంభించాడు.
'నాగుపాముకు వైద్యం చేయడం ఇదే మొదటిసారి. పాము ఎవరినీ కాటేయకుండా మత్తుమందు ఇచ్చాం. ఆసుపత్రి సిబ్బంది కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. తల దగ్గర గాయాలవ్వడం వల్ల కుట్లు వేశాం. పాము ప్రాణానికి ఎటువంటి నష్టం లేదు.'
-రాజు కంబలే, వైద్యుడు
గాయాలతో ఉన్న పాము కోలుకున్న తర్వాత అటవీ అధికారుల సమక్షంలో అడవిలో వదిలిపెడతానని పాముల సంరక్షకుడు రమేశ్ తెలిపాడు. అతడు చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవీ చదవండి: ఎనిమిదేళ్ల బాలికపై.. స్కూల్ టాయిలెట్లో అత్యాచారం!
జనాభా నియంత్రణపై బిల్లు.. నటుడు రవికిషన్పై నెటిజన్లు ఫైర్.. నలుగురు పిల్లలున్నారంటూ..!