మధ్యప్రదేశ్లోని ఇందోర్లో నివసిస్తున్న ఓ మహిళ అత్యాచారం జరిగిన 17 ఏళ్లకు పోలీసులను ఆశ్రయించింది. 2004లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
"నీముచ్కు చెందిన బాధితురాలిపై ఇందోర్లో 2004లో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెకు ఇందోర్లో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. బాధితురాలి ఆర్థిక స్థితి దృష్ట్యా ఆమె అందుకు ఒప్పుకుంది. అప్పుడు ఆమె వయసు 23-24 మధ్య ఉంటాయి. నిందితుడి అసలు పేరు తెలియని కారణంగా ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదు. 2019లో ఫేస్బుక్ ద్వారా బాధితురాలు అతని వివరాలను ఆమె కనుగొంది. నిందితుడు రత్లాం జిల్లా జవోరాకు చెందినవాడని తెలిసింది."
-పోలీసులు
ఇదీ చదవండి : అత్యాచారం జరిగిన 27 ఏళ్లకు కేసు పెట్టిన బాధితురాలు