Shivangi Singh Rafale: భారత 73వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ సైనిక సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా పరేడ్‌ను ఘనంగా సాగింది. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో ఆద్యంతం పరేడ్ ఆకట్టుకుంది.
పరేడ్‌లో సైన్యం, వాయుసేన, నావికాదళం, కేంద్ర పారాబలగాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగమయ్యాయి. పలు ఆయుధ వ్యవస్థలు, యుద్ధట్యాంకులు, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది.
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_parade.jpg)
రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి..
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_rafale-parade.jpg)
Rafale Tableau: రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్.. భారత వాయుసేన శకటంతో పాటు కవాతులో పాల్గొన్నారు. ఐఏఎఫ్ శకటం పరేడ్‌లో భాగమైన రెండో మహిళా ఫైటర్ జెట్ పైలట్ శివాంగినే కావడం విశేషం. గతేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్.. పరేడ్‌లో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఫైటర్ జెట్ పైలట్‌గా నిలిచారు.
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_parade32.jpg)
వారణాసికి చెందిన శివాంగి 2016లో ఐఏఎఫ్‌కి ఎంపికైంది. 2017లో ఏర్పాటైన రెండో మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో సభ్యురాలీమె. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక.. రాజస్థాన్ సరిహద్దులోని వైమానిక స్థావరంలో విధుల్లో చేరింది. ఇక్కడే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వద్ద శిక్షణ పొందే అవకాశం దొరికింది. మిగ్-21 కఠినమైన ఫైటర్ జెట్. దీన్ని అత్యంత ఎత్తు నుంచి కిందకి దింపేటప్పుడు, టేకాఫ్ చేసేటప్పుడు గంటకు 340 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. శివాంగి దీన్ని నడపడంలో అసాధారణ ప్రతిభాపాటవాలని ప్రదర్శించి రఫేల్ నడిపే అర్హత సాధించింది.
1946 తిరుగుబాటు థీమ్‌తో నేవీ శకటం..
Navy Tableau 2022: ఈసారి నౌకాదళ శకటంపై 1946 నాటి నేవీ తిరుగుబాటు అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. నాడు బ్రిటిష్ సర్కారుపై తిరగబడ్డ భారతీయ నావికులు.. స్వాతంత్య్ర ఉద్యమానికి దోహదపడ్డారు.
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_parade53.jpg)
75వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని దేశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్నందున.. స్వాతంత్య్రోద్యమంలో నావీ పాత్రను శకటంలో ప్రస్తావించారు.
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_parade44.jpg)
ఈ రిపబ్లిక్ డే పరేడ్‌లో పలు రాష్ట్రాల శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒలింపియన్లతో కూడిన హరియాణా శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_parade6.jpg)
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_parade4.jpg)
![REPUBLIC DAY tableau](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286416_parafe3.jpg)
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: రాజ్‌పథ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలు
డ్రెస్సింగ్ స్టైల్ మార్చిన మోదీ.. ఉత్తరాఖండ్ టోపీ, మణిపుర్ కండువాతో..