ETV Bharat / bharat

ఐవీఎఫ్​ పద్ధతిలో లేగదూడ జననం- దేశంలోనే తొలిసారి!

బన్ని బ్రీడ్​కు చెందిన గేదె ఐవీఎఫ్​ పద్దతిలో లేగదూడకు జన్మనిచ్చింది. పాలు అధికంగా ఇచ్చే ఈ జాతి గేదెల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. దీనిపై కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ ట్విట్టర్​ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది.

Indias First Banni Buffalo IVF Calf Born
ఐవీఎఫ్​ పద్ధితిలో బన్ని బ్రీడ్​ లేగదూడ జననం- దేశంలోనే తొలిసారి
author img

By

Published : Oct 23, 2021, 4:40 PM IST

Updated : Oct 23, 2021, 5:02 PM IST

గుజరాత్ కచ్ జిల్లాలో బన్ని బ్రీడ్​కు చెందిన గేదె ఐవీఎఫ్​ పద్ధతిలో మగ లేగదూడకు జన్మనిచ్చింది. దేశంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. బన్ని జాతి గేదె దాని స్థితిస్థాపకత, శుష్క వాతావరణంలో అధిక పాల ఉత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.. అందుకే పాల ఉత్పత్తి వృద్ధికి జన్యుపరంగా అత్యంత మేలురకమైన ఈ గేదెల సంఖ్యను పెంచడం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ బన్ని బ్రీడ్​ గేదె గిర్​సోమ్​నాథ్​లోని ధనేజ్​ గ్రామానికి చెందిన పాడి రైతుది. ఇది ఐవీఎఫ్ పద్ధతిలో లేగదూడకు జన్మనివ్వడంపై కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ ట్విట్టర్​ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఈ గేదె యజమాని, సుశీల అగ్రో ఫామ్స్​కు చెందిన వినయ్​ ఎల్ వాలాకు శుభాకాంక్షలు తెలిపింది. మొత్తం ఆరు గేదెలు ఐవీఎఫ్ పద్ధతిలో గర్భందాల్చగా.. తొలి లేగదూడ శుక్రవారం జన్మించినట్లు పేర్కొంది. త్వరలో మరిన్ని దూడలు జన్మించనున్నట్లు వివరించింది.

Indias First Banni Buffalo IVF Calf Born
ఐవీఎఫ్​ పద్ధతిలో లేగదూడ జననం- దేశంలోనే తొలిసారి!

ఈ ప్రక్రియలో మొత్తం 18 గేదెల్లో ఐవీఎఫ్​ పద్ధతి ద్వారా పిండాలను అమర్చారు. వాటిలో ఆరు గర్భం దాల్చాయి. అందులో ఒక్కటి ఇప్పుడు లేగదూడకు జన్మనిచ్చింది.

తన వద్ద ఉన్న దేశీయ గేదెలు పాలు తక్కువగా ఇస్తున్నాయని అందుకే 9-12 లీటర్ల పాలిచ్చే బన్ని, ముర్రా బ్రీడ్​ గేదెల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నట్లు పాడి రైతు వినయ్ వాలా చెప్పారు. జేకే ట్రస్ట్ ఎన్​జీఓ సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు. 2017లో దేశంలో తొలిసారి ఓ ఆవు ఐవీఎఫ్ పద్ధతిలో క్రిష్ణ అనే లేగదూడకు జన్మనిచ్చిందని, అప్పుడు కూడా జేకే ట్రస్టే సహకారం అందించిందని గుర్తు చేశారు.

ఈ సాంకేతికతతో దేశంలో పశుసంపద పెరగడమే గాక పాల ఉత్పత్తి కూడా అధికమవుతుంది.

మోదీ మెచ్చిన గేదెలు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2020 డిసెంబర్​ 15న కచ్​ ప్రాంతంలో పర్యటించినప్పుడు బన్ని జాతి గేదెల గురించి ప్రస్తావించారు. ఆ మరునాటి నుంచే ఈ ఐవీఎఫ్ గేదెల ప్రణాళిక రూపొందించారు.​

ఇదీ చదవండి: చదువుకునేందుకు డబ్బులు లేకే చనిపోతున్నా..

Last Updated : Oct 23, 2021, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.