ETV Bharat / bharat

'అందరి చూపు కొవాగ్జిన్​ టీకా వైపే'

కొవాగ్జిన్​ టీకా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ట్వీట్​ చేసింది. ఈ టీకాను ఐసీఎంఆర్, భారత్​ బయోటెక్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి.

author img

By

Published : Dec 25, 2020, 9:20 AM IST

Indian vaccine Covaxin has drawn global attention tweets ICMR
'అందరి చూపు కొవాగ్జిన్​ టీకా వైపే'

కొవిడ్ కట్టడే లక్ష్యంగా తయారు చేస్తోన్న 'కొవాగ్జిన్' టీకా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఈ టీకా రెండు దశల క్లినికల్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయని ట్విట్టర్​ వేదికగా తెలిపింది. 22 కేంద్రాల్లో పరీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

"ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా తయారు చేస్తోన్న కొవాగ్జిన్ మంచి ఫలితాలను ఇస్తోంది. కొవాగ్జిన్​ సురక్షితమైందని తెలుస్తోన్న నేపథ్యంలో 'లాన్సెట్' జర్నల్​ ఈ టీకా గురించి ప్రచురించేందుకు ఆసక్తి చూపుతోంది" అని ఐసీఎంఆర్ ట్వీట్​ చేసింది.

కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం వలంటీర్లను ఆహ్వానించింది ఆల్​ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎమ్ఎస్). టీకా అభివృద్ధిలో ఏఐఐఎమ్​ఎస్ కూడా భాగస్వామ్యం వహిస్తోంది.

ఇదీ చదవండి:వెలుగునిచ్చే గురువుల భవిష్యత్తు చీకటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.