Indian Statistical Institute Recruitment 2023 : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే. ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్‌స్టిట్యూట్(ఐఎస్ఐ) కోల్‌కతాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏయే ఉద్యోగాలున్నాయి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? జీతభత్యాలు? దరఖాస్తు విధానం.. వివరాలు మీ కోసం.
ఏయే పోస్టులు ఉన్నాయంటే..
- డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఫైనాన్స్)- ఏ-1
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 1
- ఇంజినీర్(ఎలక్ట్రికల్)- ఏ-2
- ఇంజినీరింగ్ అసిస్టెంట్(సివిల్)- ఏ-3
- ఇంజినీరింగ్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)- ఏ-1
కావాల్సిన అర్హతలు..
డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)- ఏ
- ACA/AICWA/MBA(F)/SOGE బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ప్రభుత్వ అకౌంట్స్, ఫైనాన్స్ విభాగంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా ప్రముఖ అకడెమిక్ , రిసెర్చ్ సంస్థలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
- ప్రభుత్వ నియమ నిబంధనలపై మంచి అవగాహన కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- ఏ
- బీఈ లేదా అందుకు సమానమైన అర్హతతో సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
- కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగ అనుభవం అవసరం.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ (సివిల్)- ఏ
- హైయ్యర్ సెకండరీ(10+2) లేదా అందుకు సమానమైన మూడేళ్ల డిప్లమా చేసి ఉండాలి.
- (సంబంధిత సబ్జెక్టుల్లో) ఒక సంవత్సరం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్)- ఏ
హైయ్యర్ సెకండరీ (10+2) లేదా తత్సమాన విద్యార్హత మూడేళ్ల డిప్లమో చేసి ఉండాలి. దీంతో పాటు ఒక సంవత్సరం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవసరం. సూపర్ వైజర్ లైసెన్స్ ఉండాలి.
గమనిక : విద్యార్హత వివరాలు కోసం ఆఫీషియల్ నోటిఫికేషన్‌ను చూడగలరు.
జీతభత్యాలు
- డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) 'ఏ' : రూ.78,800 నుంచి రూ.2,09,200/- వరకు చెల్లిస్తారు
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1 : రూ. 67,700 నుంచి రూ.2,08,700/- వరకు ఉంటుంది.
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : వేతన శ్రేణి రూ. 56,100 నుంచి రూ.1,77,500/- ఉంటుంది.
- ఇంజినీర్(ఎలక్ట్రికల్) 'ఏ' : రూ. 44,900 నుంచి రూ.1,42,400/- కూడా చెల్లిస్తారు.
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ సివిల్ 'ఏ' : రూ. 35,400 నుంచి 1,12,400/- తోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 'ఏ' : రూ. 35,400 నుంచి రూ.1,12,400/- వరకు జీతభత్యాలు ఉంటాయి.
ఏ విధంగా ధరఖాస్తు చేసుకోవాలి?
పై ఉద్యోగాలకు అర్హులైనవారు తమ వివరాలను నోటిఫికేషన్లో తెలిపిన విధంగా నింపాలి. మీ విద్యార్హత జిరాక్స్ ప్రతులను జత చేయాలి. వాటితో పాటు మీ ఉద్యోగానుభవం, ఒక వేళ ఏదైనా దివ్యాంగత్వం ఉంటే ఆ పత్రాలను వాటికి జతచేయాలి. వాటన్నింటిని కలిపి స్పీడ్‌పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ , ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, 203, బి.టి. రోడ్, కోల్‌కతా-700108 అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తు రుసుము
- డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) 'ఏ' : UR/EWS/OBC రూ.1,000
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1 : SC/ST/Women అభ్యర్థులకు రూ.500
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : PWBD వారికి దరఖాస్తు రుసుం లేదు
- ఇంజినీర్(ఎలక్ట్రికల్) 'ఏ' : UR/EWS/OBC చెందిన అభ్యర్థులకు రూ.500
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ సివిల్ 'ఏ' : SC/ST/Women అభ్యర్థులకు రూ. 250
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 'ఏ' : అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
- దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్ 04,2023
గమనిక : మరిన్ని వివరాలకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వారి అధికారిక వెబ్సైట్ సందర్శించండి.
వేలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు, 15 రోజుల్లో నోటిఫికేషన్- పది పాసైతే చాలు!
ఏవియేషన్ రంగంలో జాబ్ చేస్తారా? రూ,లక్షా40వేల జీతంతో ఉద్యోగాలు- దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!