ETV Bharat / bharat

రైలు​ హారన్లు 11 రకాలని మీకు తెలుసా? వాటి అర్థాలు తెలిస్తే షాకే! - How many Types of Horn in Train

Indian Railway Horn Types and their Meanings in Telugu: రైలు కూతకు చాలా మందికి తెలిసిన అర్థాలు రెండే. ఒకటి ట్రైన్ బయల్దేరుతోందని.. మరొకటి పక్కకు జరగాలని. కానీ.. ట్రైన్​ హారన్​లో ఏకంగా 11 రకాలు ఉంటాయని.. ఒక్కో హారన్‌కు ఒక్కో అర్థం ఉందని మీకు తెలుసా..?

Indian Railway Horn Types and their Meanings
Indian Railway Horn Types and their Meanings in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 5:15 PM IST

Indian Railway Horn Types and their Meanings in Telugu: ఒక రైలు సురక్షితంగా గమ్యం చేరాలంటే.. వ్యవస్థ మొత్తం సమన్వయంగా పనిచేయాలి. సిగ్నలింగ్ సిబ్బంది నుంచి లోకో పైలెట్, రైల్వే గార్డుల వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే.. అన్ని విషయాలు వైరెలెస్ సెట్ల ద్వారా పంచుకోడానికి సాధ్యం కాదు. అందుకే.. రైలు కూతల ద్వారా లోకో పైలెట్.. ఆ విషయాన్ని సిబ్బందికి తెలియజేస్తారు. హారన్ మోగిన తీరును గుర్తించి.. వెంటనే సిబ్బంది తదునుగుణంగా స్పందిస్తారు. మరి, ఆ 11 హారన్ల సంగతేంటో.. ఈ కథనంలో తెలుసుకుందాం.

  • One Short Horn: మొదటిది వన్‌ షార్ట్‌ హారన్‌. రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు.. రైలును శుభ్రం చేసేందుకు సంబంధిత యార్డుకు తరలిస్తారు. ఆ సమయంలో ఈ హారన్‌ ఉపయోగిస్తారు. ఇది ఒకసారి మాత్రమే మోగుతుంది. దీంతో.. వెంటనే సిబ్బంది క్లీనింగ్​ పనిలో చేరిపోతారు.
  • Two Short Horn: రెండవది టు షార్ట్‌ హారన్‌.. ఈ హారన్‌ను కూడా చాలా తక్కువ సమయం పాటు వరుసగా రెండు సార్లు మోగిస్తారు. 2 షార్ట్‌ హారన్‌ ఇచ్చినప్పుడు.. రైలును స్టార్ట్ చేయడానికి రైల్వే సిగ్నల్‌ను డైరెక్ట్ చేయమని గార్డుకి సూచించినట్లు అర్థం.
  • Three Smaller Horns: త్రీ షార్ట్‌ హారన్స్‌ను కూడా చాలా వెంట వెంటనే మూడుసార్లు మోగిస్తారు. లోకో పైలట్‌ ఇంజిన్‌పై నియంత్రణ కోల్పోయినప్పుడు వాక్యూమ్‌ బ్రేక్‌ను లాగాల్సిందిగా సిబ్బందికి సూచించడం కోసం ఈ హారన్‌ను ఉపయోగిస్తారు.

రైల్లో హాఫ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు - మీకు తెలుసా..?

  • Four Smaller horns: ఫోర్‌ షార్ట్‌ హారన్‌ను కూడా లోకో పైలట్‌ చాలా తక్కువ సమయంపాటు వరుసగా నాలుగు సార్లు ఈ హారన్‌ను మోగిస్తారు. రైలులో ఏదైనా టెక్నికల్‌ సమస్య తలెత్తినప్పుడు.. రైలు ముందుకు కదలలేదని సూచించడానికి లోకో పైలట్‌ ఈ హారన్‌ను ఉపయోగిస్తారు.
  • Continuous Horn: ఈ హారన్‌ ట్రైన్​ రన్నింగ్​లో ఉండగానే.. ఆగకుండా కాసేపు మోగుతూనే ఉంటుంది. సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలో ఎక్కువగా ఈ హారన్‌ ఉపయోగిస్తారు. ఈ హారన్‌ ఓ రకంగా ప్రయాణికులకు అలర్ట్‌ లాంటిది. కొన్ని స్టేషన్ల వద్ద రైలు ఆగదని సూచిస్తూ ఈ హారన్‌ మోగిస్తూ స్టేషన్‌ మీదుగా వెళ్తుంది.
  • One long horn and one short: ఈ హారన్‌.. రైలును స్టార్ట్ చేసే ముందు లోకో పైలట్‌ మోగిస్తారు. ఒక లాంగ్ హారన్ మోగిన తర్వాత షార్ట్ హారన్ ఉపయోగిస్తారు. రైలు ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసేముందు బ్రేక్‌ పైప్‌ సిస్టమ్‌ను సెట్‌ చేయమని సిబ్బందికి సూచించేందుకు ఈ హారన్‌ ఉపయోగిస్తారు.

Indian Railways serving Meals at Rs 20 : రైల్వే ప్రయాణికులకు.. రూ.20కే భోజనం..!

  • Two Long and two short horns: రైలు ఇంజిన్‌ను ప్రాథమికంగా కంట్రోల్‌ చేయాల్సిన సమయంలో.. గార్డ్‌కు సూచిస్తూ లోకో పైలట్‌ ఈ హారన్‌ ఉపయోగిస్తారు. ఈ హారన్‌లో లోకో పైలట్‌ రెండు సార్లు లాంగ్ హారన్, రెండు సార్లు షార్ట్ హారన్ మోగిస్తారు.
  • Two Horns with Two Pauses: టూ హారన్స్​ విత్‌ టూ పాజెస్‌ హారన్‌ను రైలు రైల్వే క్రాసింగ్‌ను దాటే సమయంలో లోకో పైలట్ మోగిస్తారు. ఈ సందర్భంలో లోకో పైలట్‌ రెండు సార్లు హారన్లను ఆగి ఆగి మోగిస్తారు.
  • Two long and Short Horns: రైలు పట్టాలపై ట్రాక్‌ను మార్చే ముందు లోకో పైలట్‌ ఈ హారన్‌ మోగిస్తారు. రెండు సార్లు లాంగ్‌ హారన్‌, ఒక షార్ట్‌ హారన్‌ను వరుసగా మోగిస్తారు.
  • Two Short One Long Horn: ఈ హారన్‌ను రెండు సందర్భాల్లో మోగిస్తారు. ఒకటి ప్రయాణికుడు చైన్‌ లాగిన సందర్భంలో.. లేదా గార్డ్‌ వ్యాక్యూమ్‌ బ్రేక్‌ను ఆన్‌ చేసినప్పుడు ఈ హారన్ మోగిస్తారు. వరుసగా రెండు సార్లు షార్ట్‌ హారన్‌, ఒక లాంగ్‌ హారన్‌ ఈ సందర్భంలో ఉపయోగిస్తారు.
  • Six Times Short Horns: రైలు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లోకో పైలట్‌ ఈ సిగ్నల్‌ ఉపయోగిస్తారు. వరుసగా ఆరు సార్లు చిన్న హారన్‌లు మోగిస్తారు.

రైల్లో సిగరెట్ తాగితే మూడేళ్ల జైలు.. రూ.1000 జరిమానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.