ETV Bharat / bharat

ఇండియన్​ నేవీలో 910​ ఉద్యోగాలు​ - దరఖాస్తుకు మరో 11 రోజులే ఛాన్స్​! - నేవీలో 910 సివిలియన్​​ జాబ్స్​

Indian Navy Jobs 2023 : భారత నౌకాదళంలో మొత్తం 910 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. మరి అవి ఏం పోస్టులు? వాటికి కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి​, జీతభత్యాలు, దరఖాస్తు గడువు, అప్లికేషన్​ ఫీజు తదితర వివరాలు మీకోసం.

Indian Navy Recruitment Notification 2023
Indian Navy Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 11:51 AM IST

Indian Navy Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి గుడ్​న్యూస్​. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 910 సివిలియన్​ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది భారత నౌకాదళం. ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఐఎన్‌సెట్‌) ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు. అర్హత ఉండి ఆసక్తి గల యువతీయువకులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివారులు
Indian Navy Jobs 2023 Vacancy Details :

ఛార్జ్‌మెన్‌ వర్క్‌షాప్‌ పోస్టుల వివరాలు(గ్రూప్‌-బీ)
మొత్తం ఖాళీలు - 22

ఛార్జ్‌మెన్‌ వర్క్‌షాప్‌కు కావాల్సిన విద్యార్హతలు
బీఎస్సీ మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

ఛార్జ్‌మెన్‌ ఫ్యాక్టరీ పోస్టుల వివరాలు(గ్రూప్‌-బీ)
మొత్తం ఖాళీలు- 20

ఛార్జ్‌మెన్‌ ఫ్యాక్టరీకు కావాల్సిన విద్యార్హతలు
బీఎస్సీ మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల వివరాలు(గ్రూప్‌-బీ)

  • ఎలక్ట్రికల్‌- 142
  • మెకానికల్‌- 26
  • కన్‌స్ట్రక్షన్‌- 29
  • కార్టోగ్రాఫిక్‌- 11
  • ఆర్మమెంట్‌- 50

సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌కు కావాల్సిన విద్యార్హతలు

  • పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
  • రెండేళ్ల డిప్లొమా లేదా డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి.
  • దరఖాస్తు చేసుకున్న విభాగం ప్రకారం ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌/ కార్టోగ్రఫీ వీటిలో ఎందులోనైనా మూడేళ్లు డ్రాయింగ్‌/ డిజైన్‌ అనుభవం తప్పనిసరి.

డ్రాఫ్ట్స్‌మెన్‌ మేట్‌ పోస్టుల వివరాలు(గ్రూప్‌-సీ)

  • వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌- 565
  • సదరన్‌ నేవల్‌ కమాండ్‌- 36
  • ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌- 9

డ్రాఫ్ట్స్‌మెన్‌ మేట్‌కు కావాల్సిన విద్యార్హతలు

  • పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ నిర్దేశిత ట్రేడుల్లో సర్టిఫికెట్‌ తప్పనిసరి.
  • నోటిఫికేషన్‌లో పేర్కొన్న 64 ఐటీఐ ట్రేడుల్లో ఏదైనా పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఏజ్​ లిమిట్
Indian Navy Jobs 2023 Age Limit : ​(2023 డిసెంబరు 31 నాటికి)

  • సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ఉద్యోగాలకు 27 ఏళ్లు మించకూడదు.
  • ఛార్జ్‌మెన్, ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లలోపు ఉండాలి.

వయోపరిమితి సడలింపులు
Indian Navy Jobs 2023 Age Limit Exemption :

  • ఓబీసీలకు- 3 ఏళ్లు
  • ఎస్సీ, ఎస్టీలకు- 5 ఏళ్లు
  • దివ్యాంగులకు- 10 ఏళ్లు వరకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుముసు
Indian Navy Jobs 2023 Application Fees :

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
  • మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.295లను దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
Indian Navy Jobs 2023 Salary Details :

  • గ్రూప్‌-బీ పోస్టులకు ఎంపికైనవారు లెవెల్‌-6 ప్రకారం, నెలకు రూ.55,000 వరకు వేతనం ఇస్తారు.
  • గ్రూప్‌-సీలో పోస్టులైన ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ ఉద్యోగానికి సెలెక్ట్​​ అయినవారికి రూ.30,000 జీతం ఇస్తారు.
  • వీటితోపాటు ఉద్యోగులందరికీ డీఏ, హెచ్‌ఆర్‌ఏ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

పరీక్ష విధానం
Indian Navy Jobs 2023 Exam Pattern :

  • రాత పరీక్షను వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు.
  • పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  • ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
Indian Navy Jobs 2023 Selection Process : రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగ విధుల్లోకి తీసుకుంటారు.

పరీక్ష తేదీ
Indian Navy Jobs 2023 Exam Date : మీ రిజిస్టర్డ్​ ఈమెయిల్​ లేదా మొబైల్​ నంబర్​కు పరీక్ష తేదీకి సంబంధించిన వివరాలు వస్తాయి.

దరఖాస్తుకు ఆఖరు తేదీ
Indian Navy Jobs 2023 Apply Last Date : 2023 డిసెంబరు 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

జాబ్​ లొకేషన్​
Indian Navy Jobs 2023 Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ నేవీ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌
Indian Navy Official Website : పరీక్ష సిలబస్​ సహా నోటిఫికేషన్​కు సంబంధించి పూర్తి వివరాల కోసం భారత నేవీ అధికారిక వెబ్​సైట్​ https://www.joinindiannavy.gov.in/ను చూడవచ్చు.

డిగ్రీ అర్హతతో DRDOలో 102 ఉద్యోగాలు ​- అప్లై చేసుకోండిలా!

డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 గవర్నమెంట్ జాబ్స్​​ - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.