మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో వైమానిక దళానికి చెందిన శిక్షణ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ విమానం ఐఏఎఫ్ మిరేజ్-2000గా అధికారులు గుర్తించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. గ్వాలియర్‌లోని మహారాజపుర ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది.
ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని వాయుసేన స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : మంచు పర్వతాల్లో 'అగ్నివర్షం'.. భారత్ యుద్ధ సన్నద్ధం!