ETV Bharat / bharat

'భారత్​లో 'స్పుత్నిక్​ లైట్​' పరీక్షలు జరుపుతాం'

రష్యా రూపొందించిన 'స్పుత్నిక్​ లైట్​' సింగిల్​ డోసు కొవిడ్​ టీకాపై భారత్​లో పరీక్షలు జరుపుతామని నీతి ఆయోగ్​ సభ్యుడు వీకే పాల్​ తెలిపారు. అయితే.. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు. తయారీదారులు చెబుతున్నట్లుగా ఈ టీకా ఒకే డోసు సరిపోతుందన్నది నిజమని తేలితే.. దేశంలో వ్యాక్సినేషన్​ కార్యక్రమంగా వేగవంతంగా మారుతుందని చెప్పారు.

NITI Aayog member, vk paul
భారత్​లో 'స్పుత్నిక్​ లైట్​'
author img

By

Published : May 8, 2021, 5:50 AM IST

రష్యా రూపొందించిన ఒకే డోసు 'స్పుత్నిక్​ లైట్​' కరోనా టీకాపై భారత్​లో పరీక్షలు జరుపుతామని నీతి ఆయోగ్​ సభ్యుడు వీకే పాల్​ తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు.

"రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్​ వి' టీకాను మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు తీసుకునేలా అభివృద్ధి చేశారు. ఆ టీకా మొదటి డోసు తీసుకున్నప్పటి యాంటిజెన్​లు, రెండో డోసు తీసుకున్న తర్వాత యాంటీజెన్​లు విభిన్నంగా ఉన్నాయి. ఇది ఆ టీకాకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం. 'స్పుత్నిక్​ లైట్'​ టీకా విషయంలో ఒకే డోసు తీసుకుంటే సరిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. దీనిపై భారత్​లో మేం పరీక్షలు జరుపుతాం. అయితే.. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

-వీకే పాల్​, నీతి ఆయోగ్ సభ్యుడు

'స్పుత్నిక్​ లైట్'​ టీకా తయారీదారులు చెబుతున్నట్లుగా.. ఒకే డోసు టీకా సరిపోతుందన్నది నిజమేనని నిర్ధరణ అయితే.. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం అవుతుందని వీకే పాల్​ పేర్కొన్నారు.

రష్యా సంస్థ ఆర్​డీఐఎఫ్​(రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​) అభివృద్ధి చేసిన స్పత్నిక్​ వి టీకా డోసు అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ గత నెలలో షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

ఇదీ చూడండి: 'భారత్​కు 2 కోట్ల టీకాలు- 30 మిలియన్​ డాలర్ల సాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.