ETV Bharat / bharat

INDIA vs NDA Bypoll 2023 : ఇండియా X ఎన్​డీఏ.. ఫస్ట్​ మ్యాచ్​లో ఎవరిది పైచేయి? - election results today

INDIA vs NDA Bypoll 2023 : దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షాల 'ఇండియా' కూటమి, ఎన్​డీఏ హోరాహోరీ పోటీ పడ్డాయి. ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకున్నారంటే?

INDIA vs NDA Bypoll 2023
INDIA vs NDA Bypoll 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 6:06 PM IST

Updated : Sep 8, 2023, 7:06 PM IST

INDIA vs NDA Bypoll 2023 : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏను గద్దెదించాలన్న లక్ష్యంతో ఏర్పడిన 'ఇండియా' కూటమి.. ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చింది! ఆయా రాష్ట్రాల్లోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు చోట్ల విజయం సాధించింది. బీజేపీ.. మూడు స్థానాల్లో గెలుపొందింది.

'ఇండియా కూటమికి ఇది తొలి విజయం'
UP By Election 2023 : ఉత్తర్​ప్రదేశ్​ మౌ జిల్లాలోని ఘోసి అసెంబ్లీ స్థానంలో ఇండియా కూటమిలోని సమాజ్​వాదీ పార్టీ.. విజయం దుందుభి మోగించింది. ఎస్​పీ అభ్యర్థి సుధాకర్‌సింగ్‌.. బీజేపీ అభ్యర్థి ధారా సింగ్ చౌహాన్‌పై 42,759 ఓట్ల తేడాతో గెలుపొందారు. కౌంటింగ్​ ముగియకముందే సుధాకర్​ సింగ్​ గెలిచినట్లేనని.. ఇండియా కూటమికి ఇది తొలి విజయమని ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ ట్వీట్​ చేశారు. 2024 ఎన్నికల్లో ఇదే పునరావృతం​ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఝార్ఖండ్​లో బేబీ దీవి గెలుపు..
Jharkhand By Election 2023 : ఝార్ఖండ్​లోని డుమ్రీ నియోజకవర్గంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అభ్యర్థి బేబీ దేవి విజయం సాధించారు. ఎన్​డీఏ తరఫున బరిలోకి దిగిన యశోదా దేవిపై 17వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు.

ఊమెన్ చాందీ కుమారుడికే పట్టం..
Kerala By Election 2023 : కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత, దివంగత ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్.. 36 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కేరళ కాంగ్రెస్ దిగ్గజం ఊమెన్ చాందీ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. 53 ఏళ్లుగా ఈ స్థానానికి ఊమెన్ చాందీ నేతృత్వం వహించగా.. ఓటర్లు మళ్లీ ఆయన కుమారుడికే పట్టంకట్టారు.

బంగాల్​లో టీఎంసీ విజయకేతనం..
Bengal By Election 2023 : బంగాల్​లో ధుప్‌గురి నియోజకవర్గంలో అధికార టీఎంసీ జయకేతనం ఎగరేసింది. టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్రరాయ్.. 4,313 ఓట్లతో గెలుపొందారు. బీజేపీ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన ధుప్​గుడి అసెంబ్లీ స్థానానికి కమలం పార్టీ, అధికార టీఎంసీతో పాటు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి పోటీ పడింది.

ఉత్తరాఖండ్​లో కమల దళం జోరు..
ఞUttarakhand By Election 2023 : ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ సీటును.. కమలం పార్టీ నిలబెట్టుకుంది. బీజేపీ అభ్యర్థి పార్వతీదాస్ 2,400 ఓట్లకుపైగా తేడాతో గెలిచారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ ఈ ఏడాది ఏప్రిల్​లో కన్నుమూసిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. 2007 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చందన్ రామ్.. సతీమణికే ఓటర్లు జైకొట్టారు.

త్రిపుర రెండు సీట్లు బీజేపీవే...
Tripura By Election 2023 : త్రిపురలోని ధన్‌పుర్, బాక్సానగర్ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. బాక్సానగర్ స్థానంలో సీపీఎం తరఫున మిజాన్ హుస్సేన్​పై తఫజ్జల్ హుస్సేన్ విజయం సాధించారు. మరోవైపు, ధన్​పుర్​ స్థానంలో కౌశిక్ దేబ్​నాథ్​పై బిందు దేబ్‌నాథ్ గెలుపొందారు.
Election Results Today : ఈ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Last Updated : Sep 8, 2023, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.