హిందూ మహాసముద్రంలో.. భారత్, అమెరికా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను బుధవారం ప్రారంభించాయి. రెండు రోజులపాటు ఈ విన్యాసాలు ప్రదర్శించనున్నాయి ఇరు దేశాలు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
అమెరికా తమ నావికాదళమైన యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్కు చెందిన యుద్ధనౌకలు, ఎఫ్-18, ఈ-2సీ యుద్ధ విమానాలను ఈ విన్యాసాల కోసం మోహరించింది.
భారత్ తమ జాగ్వార్, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం, గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్ చేసే ఐఎల్-78 యుద్ధవిమానం, ఏడబ్ల్యూఏసీసీ యద్ధవిమానాలను, ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ టెగ్ యద్ధనౌకలను మోహరించింది. వీటితో పాటు.. పీ8ఐ సముద్రతీర నిఘా వ్యవస్థను, మిగ్29కే యుద్ధవిమానాలను కూడా భారత్ ఈ విన్యాసాల కోసం సిద్ధం చేసింది.





ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం సహా సముద్రతీర ప్రాంతాల్లో సమగ్ర సమన్వయం కోసం ఈ రెండురోజుల విన్యాసాలను చేపడుతున్నట్లు భారత నౌకాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మాద్వాల్ తెలిపారు. కేరళ తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆ ఉగ్రవాది ఇంటి వద్ద పేలుడు- ముగ్గురు మృతి
ఇదీ చూడండి: 'ఏకపక్ష చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించం'