Agni missile 4: తూర్పు లద్దాఖ్‌లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు దీటైన సవాల్ విసిరే దిశగా భారత్ కీలక విజయం సాధించింది. 4వేల కిలోమీటర్ల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపకల్పం నుంచి దీనిని ప్రయోగించింది. ఈ మేరకు సాయంత్రం 7గంటల 30 నిమిషాలకు ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ పరీక్షలను సాధారణ ప్రయోగాల్లో భాగంగానే నిర్వహించామని చెప్పింది. భారత అణు సామర్థ్యాన్ని చాటి చెబుతుందని పేర్కొంది.
అంతకుముందు భారత్ 2021 జూన్‌లో 2వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల అణ్వాయుధ సామర్థ్య అగ్ని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భారత వ్యూహాత్మక ఆయుధ సంపత్తిని పర్యవేక్షిస్తున్న వ్యూహాత్మక బలగాల కమాండ్‌లో అగ్ని-5 చేర్చేందుకు ప్రయోగ విజయం వీలు కల్పించనుంది. అగ్నిశ్రేణి క్షిపణి వ్యవస్థలో సృజనాత్మక నిర్దేశం, నియంత్రణ యంత్రాంగాలు, దేశీయంగానే రూపొందించిన నావిగేషన్ వ్యవస్థ అనేక అత్యాధునిక సాంకేతికతలను వినియోగించారు.
ఇదీ చదవండి: కంట్రోల్ తప్పిన హెలికాప్టర్, విమానం.. లక్కీగా వందల మంది..