ETV Bharat / bharat

'విజయవంతంగా కరోనా కొత్త వైరస్​ వృద్ధి' - ఐసీఎంఆర్​

కరోనా కొత్త రకం వైరస్​ను దేశ ప్రయోగశాలల్లో వృద్ధిచేయడానికి తలపెట్టిన ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఐసీఎంఆర్​ వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే తొలిసారి అని పేర్కొంది.

India successfully cultures UK-variant of Sars-CoV-2: ICMR
కరోనా కొత్త వైరస్​ వృద్ధి సక్సెస్​: ఐసీఎంఆర్​
author img

By

Published : Jan 3, 2021, 5:24 AM IST

బ్రిటన్​లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్​ను భారత్​లోని ప్రయోగశాలల్లో విజయవంతంగా వృద్ధిచేసినట్లు భారత వైద్య పరశోధన మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ సార్స్​కోవ్​-2 బ్రిటన్​​ రకాన్ని(వేరియంట్​) వేరుచేయలేదని, వృద్ధి చేయలేదని ఐసీఎంఆర్​ ట్వీట్టర్​ వేదికగా వెల్లడించింది.

"బ్రిటన్​ నుంచి భారత్​కు తిరిగివచ్చిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా జాతీయ వైరాలజీ సంస్థలో కొత్త వైరస్​ను విజయవంతంగా వేరు చేశాం. వృద్ధి చేశాం," అని వివరించింది ఐసీఎంఆర్​. ఇందుకోసం ఐసీఎంఆర్​-ఎన్​ఐవీ శాస్త్రవేత్తలు వెరో సెల్​లైన్స్​ని ఉపయోగించినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:- 7 నెలల తర్వాత దిల్లీలో అతి తక్కువ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.