దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 45,951 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 817మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 60,729 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.92శాతం నమోదైంది.
- మొత్తం కేసులు : 3,03,62,848
- మొత్తం మరణాలు : 3,98,454
- కోలుకున్నావారు : 2,94,27,330
- యాక్టివ్ కేసులు :5,37,064
మొత్తం టెస్టులు..
మంగళవారం ఒక్కరోజే 19,60,757 మందికి కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి : COVID-19 variant: కొత్తగా 'లాంబ్డా' కలకలం!
'టీకా తీసుకోనివారిలోనే డెల్టా రకం వేగంగా వ్యాప్తి'
వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 33,28,54,527వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే.. 36,51,983 మందికి వ్యాక్సిన్ అందినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కొవిడ్ బాధితుల్లో కొత్త ఇన్ఫెక్షన్.. ఒకరు మృతి!