ETV Bharat / bharat

దేశంలో మరో 2,500 కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

INDIA COVID CASES: దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 2,568 కేసులు నమోదయ్యాయి. 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : May 3, 2022, 9:38 AM IST

India corona cases
భారత్​లో కరోనా కేసులు

Covid cases latest: దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య.. సోమవారంతో పోలిస్తే కాస్త తగ్గింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా.. 2,568 పాజిటివ్‌లు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో దేశంలో యాక్టివ్ కేసులు 19,137గా ఉన్నాయి. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా.. ఇప్పటివరకు 189 కోట్ల 41 లక్షల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

  • యాక్టివ్ కేసులు: 19,137
  • మొత్తం మరణాలు: 5,23,889
  • రికవరీలు: 4,25,41,887
  • మొత్తం కేసులు: 4,30,84,913

Covid cases around the world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ముందు రోజుతో పోలిస్తే 35 వేలకు పైగా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 2,54,740 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 1,283 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో అత్యధికంగా 40 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. 122 మంది మరణించారు.
  • ఆస్ట్రేలియాలో కొత్తగా 31,084 కేసులు బయటపడ్డాయి. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​లో తాజాగా 25,425 కేసులు నమోదయ్యాయి. 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 20,595 కేసులు వెలుగుచూశాయి. 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో 20,084 కేసులు బయటపడ్డాయి. 83 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: మంత్రిని భయపెట్టిన ఎలుక.. అధికారులకు ముచ్చెమటలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.